ధోని కంపెనీకి రైనా గుడ్‌బై | Dhoni to company raina goodbye | Sakshi
Sakshi News home page

ధోని కంపెనీకి రైనా గుడ్‌బై

Published Wed, Jul 29 2015 1:22 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

ధోని కంపెనీకి రైనా గుడ్‌బై - Sakshi

ధోని కంపెనీకి రైనా గుడ్‌బై

ఐఓఎస్ స్పోర్ట్స్‌తో ఒప్పందం
న్యూఢిల్లీ:
భారత క్రికెటర్ సురేశ్ రైనా తన బ్రాండింగ్, ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు చూసేం దుకు కొత్త కంపెనీతో జత కట్టాడు. ఈ క్రమంలో తన కెప్టెన్, ఆత్మీయుడు ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీతో అతని సుదీర్ఘ అనుబంధం ముగిసింది. ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు.

మూడేళ్ల కాలానికి దాదాపు రూ. 35 కోట్ల మొత్తానికి ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. ఇకపై రైనాకు సంబంధించిన ఎండార్స్‌మెంట్స్, లెసైన్స్‌లు, దుస్తుల ప్రమోషన్, అకాడమీల ఏర్పాటు తదితర వ్యవహారాలన్నీ ఐఓఎస్ మేనేజ్ చేస్తుంది. ఈ కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్న తొలి క్రికెటర్ రైనా కావడం విశేషం. ఒలింపియన్లు విజేందర్, మేరీకామ్, సుశీల్, గగన్, సుశీల్ తదితర 20 మంది క్రికెటేతర ఆటగాళ్లతో ఈ సంస్థ అనుబంధం కలిగి ఉంది. ప్రస్తుతం రైనాతో అడిడాస్ సంస్థ ఒక్కటే మూడేళ్ల కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement