భారతదేశంలో ప్రముఖ స్పెషాలిటీ కాఫీ బ్రాండ్‌గా అవతరించిన 'అరకు' (Araku).. ఇటీవల ముంబైలోని కొలాబాలో తన కొత్త రెస్టారెంట్‌ను ఆవిష్కరించింది. అరకు పేరుతో ఉన్న ఈ రెస్టారెంట్ 'సూరత్ నవాబ్' 1897లో నిర్మించిన శతాబ్దపు పురాతన భవనం సన్నీ హౌస్‌లో ఏర్పాటైంది.
ఈ రెస్టారెంట్ 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 55 మంది భోజనం చేయడానికి సరిపడే విధంగా ఏర్పాటు చేశారు. న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటా రూపొందించిన ఇంటీరియర్‌లు, భారతీయ డిజైనర్లు రూపొందించిన ఫర్నీషింగ్ వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
ముంబైలో ప్రారంభమైన అరకు రెస్టారెంట్ ఇంటీరియర్స్ స్కాండినేవియన్ మినిమలిజమ్‌ను తలపిస్తాయి. రంగు రంగుల పొడవైన కిటికీలు, ఎత్తైన పైకప్పులు, చెక్క అలంకరణలు, మొక్కల పెంపకానికి అనుకూలమైన ప్రదేశాలు చూడచక్కగా ఉండటమే కాకుండా.. అతిధులను ప్రత్యేకమైన ప్రదేశంలోకి ఆహ్వానించినట్లు భావించేలా చేస్తాయి. ఇందులో ఓక్ కలప, తెల్లటి ప్లాస్టర్ గోడలు, న్యాచురల్ స్టోన్స్, సిరామిక్ సెంటర్ స్టేజ్ వంటివి కూడా ఇక్కడ గమనించవచ్చు.
బెంగళూరుకు చెందిన డిజైనర్ సందీప్ సంగారు కూడా తనదైన శైలిలో ఇక్కడ అద్భుతాలను రూపొందించారు. ఇందులో 60,000కు పైగా చిన్న కాఫీ ఎస్టేట్‌లలో గిరిజన రైతులు కాఫీ పండించే అరకు భూభాగానికి సంబంధించిన 3డీ ఫోటోలు గోడలకు ఉండటం చూడవచ్చు. గోడల మీద సౌబియా చస్మావాలా కళాఖండాలు, రిచర్డ్ మాథర్ పైక్ గిరిజన ఆర్ట్స్ ఉండటం గమనించవచ్చు.
ఇదీ చదవండి: 2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు
మెనూ విషయానికి వస్తే.. ఇందులో దేశీయ వంటకాలు మాత్రమే కాకుండా ఇతర దేశ వంటకాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్ రాహుల్ రుచులు ప్రత్యేకమైనవని చెబుతారు. ఈ రెస్టారెంట్‌లో కిడ్నీ బీన్ ఐయోలీ, కంట్రీ చికెన్, పిక్లింగ్ టొమాటో, చీజ్ సలాడ్, పర్పుల్ స్వీట్ పొటాటో గ్నోచీ, గ్రిల్డ్ ఫ్రెంచ్ బీన్స్ టాకో, హాట్-సాస్ నూడుల్స్, ష్రిమ్ప్ టోస్ట్, టోఫు, స్క్విడ్ క్రాకర్స్, కోజీ ఫ్రైడ్ చికెన్, స్ట్రీమ్డ్ చికెన్, కొబ్బరి నూడుల్స్, బీస్వాక్స్ ఐస్ క్రీమ్, పొటాటో చాక్లెట్ కేక్, క్రీమ్ కేక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment