colaba
-
ముంబైలో అరకు - ప్రత్యేకతలు ఏంటంటే?
భారతదేశంలో ప్రముఖ స్పెషాలిటీ కాఫీ బ్రాండ్‌గా అవతరించిన 'అరకు' (Araku).. ఇటీవల ముంబైలోని కొలాబాలో తన కొత్త రెస్టారెంట్‌ను ఆవిష్కరించింది. అరకు పేరుతో ఉన్న ఈ రెస్టారెంట్ 'సూరత్ నవాబ్' 1897లో నిర్మించిన శతాబ్దపు పురాతన భవనం సన్నీ హౌస్‌లో ఏర్పాటైంది. ఈ రెస్టారెంట్ 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 55 మంది భోజనం చేయడానికి సరిపడే విధంగా ఏర్పాటు చేశారు. న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటా రూపొందించిన ఇంటీరియర్లు, భారతీయ డిజైనర్లు రూపొందించిన ఫర్నీషింగ్ వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ముంబైలో ప్రారంభమైన అరకు రెస్టారెంట్ ఇంటీరియర్స్ స్కాండినేవియన్ మినిమలిజమ్ను తలపిస్తాయి. రంగు రంగుల పొడవైన కిటికీలు, ఎత్తైన పైకప్పులు, చెక్క అలంకరణలు, మొక్కల పెంపకానికి అనుకూలమైన ప్రదేశాలు చూడచక్కగా ఉండటమే కాకుండా.. అతిధులను ప్రత్యేకమైన ప్రదేశంలోకి ఆహ్వానించినట్లు భావించేలా చేస్తాయి. ఇందులో ఓక్ కలప, తెల్లటి ప్లాస్టర్ గోడలు, న్యాచురల్ స్టోన్స్, సిరామిక్ సెంటర్ స్టేజ్ వంటివి కూడా ఇక్కడ గమనించవచ్చు. బెంగళూరుకు చెందిన డిజైనర్ సందీప్ సంగారు కూడా తనదైన శైలిలో ఇక్కడ అద్భుతాలను రూపొందించారు. ఇందులో 60,000కు పైగా చిన్న కాఫీ ఎస్టేట్లలో గిరిజన రైతులు కాఫీ పండించే అరకు భూభాగానికి సంబంధించిన 3డీ ఫోటోలు గోడలకు ఉండటం చూడవచ్చు. గోడల మీద సౌబియా చస్మావాలా కళాఖండాలు, రిచర్డ్ మాథర్ పైక్ గిరిజన ఆర్ట్స్ ఉండటం గమనించవచ్చు. ఇదీ చదవండి: 2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు మెనూ విషయానికి వస్తే.. ఇందులో దేశీయ వంటకాలు మాత్రమే కాకుండా ఇతర దేశ వంటకాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్ రాహుల్ రుచులు ప్రత్యేకమైనవని చెబుతారు. ఈ రెస్టారెంట్లో కిడ్నీ బీన్ ఐయోలీ, కంట్రీ చికెన్, పిక్లింగ్ టొమాటో, చీజ్ సలాడ్, పర్పుల్ స్వీట్ పొటాటో గ్నోచీ, గ్రిల్డ్ ఫ్రెంచ్ బీన్స్ టాకో, హాట్-సాస్ నూడుల్స్, ష్రిమ్ప్ టోస్ట్, టోఫు, స్క్విడ్ క్రాకర్స్, కోజీ ఫ్రైడ్ చికెన్, స్ట్రీమ్డ్ చికెన్, కొబ్బరి నూడుల్స్, బీస్వాక్స్ ఐస్ క్రీమ్, పొటాటో చాక్లెట్ కేక్, క్రీమ్ కేక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. -
‘గత 46 ఏళ్లలో ఇదే అత్యధికం’
ముంబై: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణికిపోతుంది. అధిక వర్షాలతో ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రభుత్వం ఇప్పటికే సబర్బన్ రైలు, బస్సు సేవలను నిలిపివేసింది. ఇక ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ వంటి పర్యాటక ప్రదేశాలు కలిగిన దక్షిణ ముంబైలోని కొలాబాలో అధిక వర్షపాతం నమోదయ్యింది. గత 46 సంవత్సరాల్లో.. ఆగస్టు నెలలో.. ఒక్క రోజులో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు అధికారులు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టు నెల పూర్తి వర్షపాతంలో దాదాపు 64 శాతం వాన ఈ ఐదు రోజుల వ్యవధిలోనే నమోదయినట్లు అధికారులు తెలిపారు. (ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.) అధిక వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలను మూసి వేసింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. ముంబై, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హామీ ఇచ్చారు. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబై కొలాబాలోని రీగల్ సినిమా థియేటర్ సమీపంలోని మెట్రో హౌస్ బిల్డింగ్‌లో ఈ రోజు మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు డీసీపీ మనోజ్ శర్మ తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ గాయపడిన సమాచారం లేదన్నారు. కాగా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం స్థానికులతో పాటు టూరిస్టులు ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.