ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Major fire breaks out in building near Regal Cinema in Colaba | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Published Thu, Jun 2 2016 6:02 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

ముంబైలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబై కొలాబాలోని రీగల్ సినిమా థియేటర్ సమీపంలోని మెట్రో హౌస్ బిల్డింగ్లో ఈ రోజు మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు.

ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు డీసీపీ మనోజ్ శర్మ తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ గాయపడిన సమాచారం లేదన్నారు. కాగా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం స్థానికులతో పాటు టూరిస్టులు ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement