ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9మంది మృతి | Massive Fire Accident In Delhi At Kirari Godown | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9మంది మృతి

Published Mon, Dec 23 2019 8:04 AM | Last Updated on Mon, Dec 23 2019 9:07 AM

Massive Fire Accident In Delhi At Kirari Godown - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్‌లో జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో ఈ వస్త్ర గోడౌన్‌ మొదటి అంతస్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12. 30 సమయంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఫైర్‌ సిబ్బంది, అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement