యువరాజ్ సింగ్ (PC: BCCI)
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2024లో భాగం కానున్నాడు. న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్ట్రైకర్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. యువీని తమ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. యువరాజ్ సింగ్ తమ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఫ్రాంఛైజీ.. అతడికి సాదర స్వాగతం పలుకుతున్నామని పేర్కొంది.
తొలి సీజన్ విజేతలుగా ఆ జట్లు
కాగా గతేడాది ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ టోర్నీలో ఆరు జట్లు చండీగఢ్ చాంప్స్, నాగ్‌పూర్ నింజాస్, పట్నా వారియర్స్, వైజాగ్ టైటాన్స్, ఇండోర్ నైట్స్, గువాహటి అవెంజర్స్ పాల్గొన్నాయి.
మార్చి 22 నుంచి 30 వరకు ఘజియాబాద్‌లో టోర్నీ జరిగింది. ఇక మాజీ క్రికెటర్లు పాల్గొన్న ఈ టీ20 లీగ్‌లో సురేశ్ రైనా సారథ్యంలోని ఇండోర్ నైట్స్, యూసఫ్ పఠాన్ కెప్టెన్సీలోని గువాహటి అవెంజర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి.
వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఈ రెండు జట్లను చాంపియన్స్‌గా ప్రకటించారు. అయితే, ఈసారి ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా ప్రకటన ద్వారా తేలింది.
కండిషన్స్ ఇవే
ఇక లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ ఈసారి మార్చి 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే విధంగా.. ఈసారి 90 బాల్ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఓ జట్టు ఐదుగురు బౌలర్లను బరిలోకి ఇదింపి ఒక్కొక్కరిచే మూడు ఓవర్లు వేయించాలి. అయితే, కెప్టెన్ నిర్ణయానుసారం ఒక్కరిచే మాత్రం నాలుగు ఓవర్లు వేయించవచ్చు. అయితే, 60వ బంతి పడకముందే బౌలింగ్ జట్టు కెప్టెన్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది.
Delighted to announce the legendary Yuvraj Singh joining our team!
— New York Strikers (@NewYorkStrikers) February 14, 2024
Get ready for some electrifying moments on and off the field. Welcome aboard, Yuvi! 💥 @YUVSTRONG12
📸 - @BCCI #NewYorkStrikers #NYSSquad #NY #YuvrajSingh pic.twitter.com/Kc2RWwpiMP
Comments
Please login to add a commentAdd a comment