స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ భారత యువ ఆటగాళ్లకు ఎంతో కీలకమని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో అదరగొట్టి భారత జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించాలని రైనా ఆకాంక్షించాడు. దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌కు పేస్ సంచలనాలు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
"ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు ప్రొటీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో భాగమై ఉన్నారు. అయితే టీమిండియా తరపున వారు ఎలా రాణిస్తారు అనేది ముఖ్యం. ఉమ్రాన్ మాలిక్ చాలా టాలెంట్ ఉన్న బౌలర్. అదే విధంగా అర్ష్‌దీప్ ఐపీఎల్‌లో బౌలింగ్ చేసిన విధానం అద్భుతమైనది. ఇక కెప్టెన్‌గా రాహుల్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ ఇప్పుడు భారత జట్టు వంతు వచ్చింది. అయితే అతడు జట్టును విజయం పథంలో నడిపిస్తాడని నేను భావిస్తున్నాను "అని రైనా పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూన్9న ఢిల్లీ వేదికగా జరగనుంది.
చదవండి: SL Vs AUS 1st T20: తొలి టీ20.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
Comments
Please login to add a commentAdd a comment