
Photo Courtesy: Twitter
ముంబై: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 69 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 191 పరుగులు చేయగా, ఆర్సీబీ 122 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ క్యూట్టేసింది.
రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించగా, తాహీర్ రెండు వికెట్లు సాధించాడు. సామ్ కరాన్, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ లభించింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోవడంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆర్సీబీ వికెట్లు వరుసగా పడుతూ సీఎస్‌కే గెలుపు ఖాయమైన వేళ ఆ జట్టులో జోష్ ఎక్కువవైంది. కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా సరదా సరదాగా జోకులు వేశాడు.
ఏబీ డివిలియర్స్ ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరినప్పుడు హర్షల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో ధోని మాట్టాడిన మాటలు వికెట్ల వద్దనున్న మైక్‌లో రికార్డయయ్యాయి. సాధారణంగా మ్యాక్స్‌వెల్, ఏబీ వంటి విదేశీ ఆటగాళ్లు క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ధోని హిందీలో మాట్లాడుతూ ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉంటాడు.
కానీ హర్షల్ పటేల్ బ్యాటింగ్‌కు క్రీజ్‌లోకి అడుగుపెట్టే సందర్భంలో తాను హిందిలో ఫీల్డింగ్ పెట్టనంటూ ఫీల్డింగ్ పెట్టనంటూ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా వ్యాఖ్యానించడంతో అతను పగలబడి నవ్వాడు. దీనికి కామెంటేటర్లు కూడా నవ్వడం, దీన్ని ఒక అభిమాని ట్వీటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
— pant shirt fc (@pant_fc) April 26, 2021
Comments
Please login to add a commentAdd a comment