ఐపీఎల్ మెగావేలంలో తొలిరోజు అన్‌సోల్డ్ జాబితా లిస్ట్ పెద్దదే. అయితే అందరిని షాక్‌కు గురి చేసిన విషయం ఏంటంటే సురేశ్ రైనా అమ్ముడుపోకపోవడం. ఒకప్పుడు ఐపీఎల్‌ను శాసించిన అతన్ని.. ఈసారి ఒక్క ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. రూ. 2 కోట్ల బిడ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన రైనా కోసం ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపలేదు. బేస్‌ప్రైస్ వద్దే రిటైన్ చేసుకునే చాన్స్ ఉన్నా.. చెన్నై పట్టించుకోలేదు. యూఏఈలో జరిగిన ఎడిషన్‌లో అర్ధాంతరంగా తిరిగి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్, ఇమ్రాన్ తాహిర్, ఆదిల్ రషీద్, వేడ్, బిల్లింగ్స్, మహ్మద్ నబీ, డేవిడ్ మిల్లర్, సందీప్ లామిచానేను ఎవరూ పట్టించుకోలేదు. ఇండియా నుంచి ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, సాహాపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
మరి వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లను మళ్లీ కొనుక్కునే అవకాశం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అన్‌సోల్డ్ ఆటగాళ్లకు మరో చాన్స్ ఉంది. వేలం జరిగేటప్పుడు లేదా ముగిసిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు యాక్సిలరేటెడ్ రౌండ కింద వీరిని రీకాల్ చేయవచ్చు. ఒకవేళ ఇందులోనూ ఎవరూ తీసుకోకుంటే మరో అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో ఏదైనా ఫ్రాంచైజీలో ఆటగాడు గాయపడితే వారి స్థానంలో అమ్ముడుపోని ఆటగాళ్లను తీసుకునే చాన్స్ ఉంటుంది. గతంలో విండీస్ హిట్టర్ క్రిస్ గేల్‌ను ఆర్‌సీబీ ఇదే పద్దతిలో జట్టులోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment