Unsold Players In IPL 2022 Day 1: తొలిరోజు వేలంలో పలువురు ప్రముఖ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. వేర్వేరు కారణాలతో ఫ్రాంచైజీలు వారిపై ఆసక్తి చూపించలేదు. వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)ను ఎవరూ పట్టించుకోకపోవడం మాత్రం అన్నింటికంటే ఆశ్చర్యకరం. ఆసీస్ దిగ్గజ ఆటగాడే అయినా టి20ల్లో పేలవ రికార్డు స్టీవ్ స్మిత్‌కు కలిసి రాలేదు. ఐపీఎల్‌లో కూడా అతను ఇన్నేళ్లలో ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు.
ఐపీఎల్ స్టార్లలో ఒకడైన సురేశ్ రైనా ఆటకు దూరంగా ఉంటుండటం అతడిని తీసుకోకపోవడానికి కారణం. గత ఐపీఎల్ తర్వాత అతను మళ్లీ గ్రౌండ్‌లోకే దిగలేదు. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర ఉండటం భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌కు కలిసి రాలేదు.
ఇక తమకంటూ గుర్తింపు ఉండి ఐపీఎల్ టీమ్‌లు పక్కన పెట్టినవారిలో ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ముజీబ్ (అఫ్గానిస్తాన్), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), నబీ (అఫ్గానిస్తాన్), మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లండ్) ఉన్నారు. ఫ్రాంచైజీలు కోరుకుంటే వీరిలో కొందరి పేర్లు నేడు మళ్లీ వేలంలో ఉంచవచ్చు.
చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది!
IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment