unsold
-
పాపం డేవిడ్ వార్నర్.. ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు..!
నిన్న (నవంబర్ 24) ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా.. 20 మంది అన్ సోల్డ్‌గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. పాపం వార్నర్నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జానీ బెయిర్‌స్టో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..!దేవ్‌దత్ పడిక్కల్ (బేస్ ధర 2 కోట్లు)డేవిడ్ వార్నర్ (2 కోట్లు)జానీ బెయిర్‌స్టో (2 కోట్లు)వకార్ సలామ్ఖిల్ (ఆఫ్ఘనిస్తాన్, 75 లక్షలు)పియుశ్ చావ్లా (50 లక్షలు)కార్తీక్ త్యాగి (40 లక్షలు)యశ్ ధుల్ (30 లక్షలు)అన్మోల్ప్రీత్ సింగ్ (30 లక్షలు)ఉత్కర్శ్ సింగ్ (30 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)ఉపేంద్ర సింగ్ యాదవ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)కాగా, తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి 467.85 కోట్లు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర.నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ కేవలం రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. -
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా.. పరిస్థితిని గట్టెక్కించడానికి కీలక ఆలోచన చేస్తోంది. దేశంలోని స్థానిక ప్రభుత్వాలతో కలిసి లక్షల కొద్దీ అమ్ముడుపోని ఇళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.ప్రాథమిక ప్రణాళికపై స్టేట్ కౌన్సిల్ పలు ప్రావిన్సులు, ప్రభుత్వ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. రాష్ట్ర నిధుల సహాయంతో అదనపు హౌసింగ్ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి చైనా ఇప్పటికే అనేక పైలట్ ప్రోగ్రామ్‌లతో ప్రయోగాలు చేసింది. అమ్ముడుపోని ఇళ్లను ప్రభుత్వాలు కొనుగోలు చేసే తాజా ప్రణాళికను అతిపెద్ద ప్రయత్నంగా భావిస్తున్నారు.ప్రణాళికలో భాగంగా కష్టాల్లో ఉన్న డెవలపర్ల నుంచి అమ్ముడుపోని ఇళ్లను అమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు సహాయం చేస్తాయి. బ్యాంకుల రుణాల ద్వారా భారీ తగ్గింపులతో ఆ ఇళ్లను కొనుగోలుదారులకు అందిస్తాయి. ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల వివరాలను అధికారులు ఇంకా చర్చిస్తున్నారు. చైనా ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లాలనుకుంటే అది ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చైనా గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనాలో గృహాల విక్రయాలు దాదాపు 47 శాతం క్షీణించాయి. అమ్ముడుపోని ఇళ్ల జాబితా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఈ రంగంలోని దాదాపు అర కోటి మంది నిరుద్యోగం బారినపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తగ్గించడానికి కొత్త విధానాలను అన్వేషిస్తామని ఏప్రిల్ 30న పాలక కమ్యూనిస్ట్ పార్టీ హామీ ఇచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ప్రభుత్వ తదుపరి కదలికల కోసం ఎదురుచూస్తున్నారు. -
హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన ఇళ్ల సరఫరా
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతం పెరిగి 99,989 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలోని తొమ్మిది ముఖ్య పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్–జూన్ కాలంలో 1,22,213 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నూతన సరఫరా 1,10,468 యూనిట్లుగానే ఉంది. దీంతో మొత్తం మీద అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. తొమ్మిది పట్టణాల్లో కలిపి అమ్ముడుపోని యూనిట్లు 2 శాతం తగ్గి 5,15,169 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికం చివరికి వీటి సంఖ్య 5,26,914 యూనిట్లుగా ఉంది. ► టైర్–1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా (1,07,179 యూనిట్లు) ఉన్నాయి. మార్చి చివరికి ఉన్న 1,09,511 యూనిట్లతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ► ముంబైలో అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గి 60,911 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి చివరికి ఇవి 62,735 యూనిట్లుగా ఉండడం గమనార్హం. నవీ ముంబైలో మాత్రం 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 26 శాతం తగ్గి 42,133 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► చెన్నైలో వీటి సంఖ్య 18 శాతం తగ్గి 19,900 యూనిట్లుగా ఉంది. ► పుణెలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు జూన్ త్రైమాసికం చివరికి 9 శాతం పెరిగి 75,905 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరు మార్కెట్లోనూ అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 % పెరిగి 52,208 యూనిట్లుగా నమోదైంది. ► కోల్‌కతా పట్టణలో 20 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధరలపై గృహ రుణాల ప్రభావం నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక నివాస గృహాల అందుబాటు ధరలపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి–జూన్ కాలానికి ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాలకు సంబంధించి ‘అఫర్డబులిటీ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఓ సగటు గృహస్థుడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి రేటును నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ తరచూ ట్రాక్ చేస్తుంటుంది. ఓ గృహస్థుడు తన ఇంటి రుణ ఈఎంఐని చెల్లించేందుకు వీలుగా అతడి ఆదాయ నిష్పత్తిని పరిశీలిస్తుంటుంది. 2023లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై గృహ రుణాల రేట్ల ప్రభావం పడినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో అహ్మదాబాద్ అందుబాటు ధరలతో కూడిన ఇళ్ల మార్కెట్‌గా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి 23 శాతంగా ఉంది. ఆ తర్వాత 28 శాతంతో పుణె, కోల్‌కతా, 28 శాతంతో చెన్నై, బెంగళూరు, 30 శాతంతో ఢిల్లీ ఎన్సీఆర్, 31 శాతంతో హైదరాబాద్, 55 శాతంతో ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ ప్రకారరం ఒక పట్టణంలో 40 శాతం నిష్పత్తి ఉందంటే.. ఆ పట్టణంలోని నివాసులు సగటున తమ ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి రుణ ఈఎంఐ కింద చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టు అర్థం. 40 శాతం ఉంటే అందుబాటు ధరలుగా పరిగణిస్తుంది. 50 శాతానికి పైగా రేషియో ఉందంటే ఇళ్ల ధరలు అందుబాటులో లేనట్టుగా భావిస్తుంది. -
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు భేష్
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) ముగిసే నాటికి (2022 అక్టోబర్–డిసెంబర్) దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయంకాని హౌసింగ్ స్టాక్‌లు 10 శాతం తగ్గి 4,61,600 యూనిట్లకు పడిపోయాయని ప్రోప్‌ఈక్విటీ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2–జూలై–సెప్టెంబర్) ఈ సంఖ్య 5,12,526 యూనిట్లుగా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, దేశ సగటుతో సమానంగా (10 శాతం) విక్రయంకాని గృహాల సంఖ్య క్యూ2, క్యూ3ల్లో 93,473 యూనిట్ల నుంచి 84,545కు తగ్గింది. నివేదికలో కొన్ని అంశాలను పరిశీలిస్తే.. ► తొమ్మిది నగరాల్లో హౌసింగ్ విక్రయాల సంఖ్య అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,20,275 యూనిట్లు. సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య 8 శాతం అధికంకాగా, 2021 ఇదే కాలంతో పోల్చితే 10 శాతం అధికం. ► రియల్ ఎస్టేట్ గణాంకాల విశ్లేషణ సంస్థ– ప్రోప్‌ఈక్విటీ తాజా డేటా కోసం పరిగణనలోకి తీసుకున్న గృహాల్లో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఫ్లోర్లు విల్లాలు/గృహాలు ఉన్నాయి. హోల్డ్‌లో (నిలిచిపోయిన) ఉన్న అమ్మకాలు, నిర్మాణాల నిలిపివేత, లాటరీ ప్రాజెక్ట్‌లను ఈ గణాంకాల నుంచి మినహాయించడం జరిగింది. సవాళ్లు ఉన్నా... పటిష్ట రికవరీ అనేక సవాళ్లు ఉన్నప్పటికీ...ఈ ఏడాది గృహాల విక్రయాలు బాగా పుంజుకున్నాయి. ఇండస్ట్రీలో డిమాండ్, పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతుండటం గమనార్హం. వడ్డీరేట్లు స్థిరంగా పెరిగినప్పటికీ, కస్టమర్లు రుణాలు తీసుకోడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆస్తుల ధర మున్ముందు పెరుగుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. – సమీర్ జసుజా, ప్రోప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ మార్కెట్ సెంటిమెంట్ బాగుంది.. ఇంటి కొనుగోళ్లకు మార్కెట్ సెంటిమెంట్ భారీగా మెరుగుపడినందున భారతదేశం అంతటా అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో అలాగే 2022లో భారీ జంప్‌ను చూశాయి. కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటలో ఉన్న చాలా మంది కస్టమర్లు ఇప్పుడు మార్కెట్లోకి తిరిగి వచ్చారు. దీనివల్లే చివరకు బ్లాక్‌బస్టర్ అమ్మకాలు జరిగాయి. – శివాంగ్ సూరజ్, ఇన్‌ఫ్రామంత్రా వ్యవస్థాపక డైరెక్టర్ సానుకూలం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగ సూచీ సానుకూల శ్రేణిలోనే ఉంది. వచ్చే ఆరు నెలలకు సంబంధించి సూచించే మా ఫ్యూచర్ సెంటిమెంట్ ఇండెక్స్ కొంత మెరుగుపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, రియల్ ఎస్టేట్ రంగలో వృద్ధి అవకాశాల దృష్ట్యా భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు 2022 డిసెంబర్ త్రైమాసికంలో 58కి పెరిగింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 57గా ఉంది. – శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ -
ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా
ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఎప్పటిలాగే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. అయితే పేరు మోసిన ఆటగాళ్లలో రాసీ వాండర్ డసెన్, వేన్ పార్నెల్, పాల్ స్టిర్లింగ్, జేమ్స్ నీషమ్, డేవిడ్ మలాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ వేలంలో ఇంగ్లండ్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్ కరన్(18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(రూ. 16.25 కోట్లు- సీఎస్కే)తో పాటు బ్యాటర్ హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు- ఎస్ఆర్హెచ్) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే.. ► కుశాల్ మెండిస్ ► టామ్ బాంటన్ ► క్రిస్ జోర్డాన్ ► ఆడమ్ మిల్నే ► పాల్ స్టిర్లింగ్ ► రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ► షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ► ట్రెవిస్ హెడ్ ► డేవిడ్ మలన్ ► డారిల్ మిచెల్ ► మహమ్మద్ నబీ ► వేన్ పార్నెల్ ► జిమ్మీ నీషమ్ ► దాసున్ షనక ► రిలే మ్రెడిత్ ► సందీప్ శర్మ ►తబ్రైజ్ షమ్సీ ►ముజీబ్ రెహమాన్ ►చేతన్ ఎల్ఆర్ ►శుభమ్ ఖజురియా ►రోహన్ కున్నుమ్మల్ ► హిమ్మత్ సింగ్ ► ప్రియం గార్గ్ ► సౌరభ్ కుమార్ ► కార్బిన్ బాష్ ► అభిమన్యు ఈశ్వరన్ ► శశాంక్ సింగ్ ► సుమిత్ కుమార్ ► దినేష్ బానా ► మహ్మద్ అజారుద్దీన్ ► ముజ్తబా యూసుఫ్ ► లాన్స్ మోరిస్ ► చింతన్ గాంధీ ► ఇజారుల్హుక్ నవీద్ ► రేయాస్ గోపాల్ ► ఎస్ మిధున్ ► తస్కిన్ అహ్మద్ ► దుష్మంత చమీర ► ముజారబానీ దీవెన ► సూర్యాంశ్ షెడ్జ్ ► జగదీశ సుచిత్ ► బాబా ఇంద్రజిత్ ► కిరంత్ షిండే ► ఆకాష్ సింగ్ ►పాల్ వాన్ -
లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ డెవలపర్ల వద్ద అమ్ముడుపోని ఇళ్లు భారీగా ఉండిపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికం చివరికి హైదరాబాద్ మార్కెట్లో 99,090 యూనిట్లు మిగిలిపోయాయి. ఇవి అమ్ముడుపోవడానికి 41 నెలల సమయం తీసుకుంటుందని అంచనా. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇలా విక్రయం కాకుండా ఉండిపోయిన ఇళ్ల యూనిట్లు 7.85 లక్షలుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత అమ్మకాల తీరు ఆధారంగా చూస్తే, మిగిలిపోయిన 7.85 లక్షల ఇళ్లు విక్రయం కావడానికి 32 నెలలు పట్టొచ్చని పేర్కొంది. ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో 1,00,770 ఇళ్ల యూనిట్లు ఉండిపోయాయి. ఇక్కడ ఆమ్రపాలి, జైపీ ఇన్ఫ్రాటెక్, యూనిటెక్ వంటి పెద్ద రియల్టీ సంస్థలు దివాలా తీయడంతో మిగిలిన ఇళ్ల యూనిట్లు పూర్తిగా అమ్ముడుపోవడానికి 62 నెలల వరకు సమయం పట్టొచ్చు’’అని ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 2022 జూన్ నాటికి మిగిలిపోయిన ఇళ్లు 7,63,650గా ఉంటే, సెప్టెంబర్ చివరికి 7,85,260 యూనిట్లకు నిల్వలు పెరిగాయి. ఇందులో 21 శాతం ఇళ్లు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. పట్టణాల వారీగా.. ►ఈ ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ కాలంలో 49 శాతం పెరిగి 83,220 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 55,910 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ►కోల్‌కతాలో అతి తక్కువగా ఇళ్ల నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 22,530 ఇళ్ల యూనిట్లు మిగిలిపోగా, వీటి విక్రయానికి 24 నెలల సమయం పట్టొచ్చని ప్రాప్ టైగర్ అంచనా వేసింది. ► అహ్మదాబాద్‌లో 65,160 యూనిట్లు ఉండగా, ఇవి పూర్తిగా అమ్ముడుపోవడానికి 30 నెలల సమయం తీసుకోవచ్చు. ►బెంగళూరులో 77,260 యూనిట్లు మిగిలి ఉన్నాయి. వీటి అమ్మకానికి 28 నెలలు తీసుకోవచ్చు. ►చెన్నైలో 32,810 యూనిట్లుగా ఉంటే, వీటి అమ్మకానికి 27 నెలల సమయం తీసుకోవచ్చని అంచనా. ► ఇక ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 2,72,960 యూనిట్ల ఇళ్లు మిగిలిపోయాయి. వీటి అమ్మకానికి 33 నెలల సమయం పడుతుందని అంచనా. ► పుణెలో ఉన్న 1,15,310 మిగులు ఇళ్ల అమ్మకానికి 22 నెలలు సమయం తీసుకుంటుంది. ►అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ కాలం జూన్–జూలైలో 44 నెలలుగా ఉంటే, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 32 నెలలకు తగ్గడాన్ని ప్రాప్‌టైగర్ ప్రధానంగా ప్రస్తావించింది. హౌసింగ్ డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా పేర్కొంది. చదవండి👉 లగ్జరీ ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్న భారతీయులు! -
పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) పెరిగింది. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి ఇన్వెంటరీ 4% మేర పెరిగిందని ప్రాప్‌టైగర్.కామ్ సర్వేలో తేలింది. గతేడాది మార్చి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 7,05,344 గృహాల ఇన్వెంటరీ ఉండగా..ఈ ఏడాది మార్చి నాటికి 7,35,852కి పెరిగిందని తెలిపింది. ఇన్వెంటరీ అత్యధికంగా ముంబైలో 35% ఉండగా.. పుణేలో 16% మేర ఉన్నాయి. కాగా.. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఇన్వెంటరీ విక్రయానికి 47 నెలల సమయం పట్టగా.. ఈ ఏడాది మార్చి ఇన్వెంటరీకి 42 నెలల సమయం పడుతుంది. నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 73,651 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 42 నెలల సమయం పడుతుంది. అహ్మదాబాద్‌లో 62,602 గృహాలు, బెంగళూరులో 66,151, చెన్నైలో 34,059, ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,01,404, కోల్‌కతాలో 23,850, ముంబైలో 2,55,814 గృహాల ఇన్వెంటరీ ఉంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో చాన్స్ .. అదేంటంటే
ఐపీఎల్ మెగావేలంలో తొలిరోజు అన్‌సోల్డ్ జాబితా లిస్ట్ పెద్దదే. అయితే అందరిని షాక్‌కు గురి చేసిన విషయం ఏంటంటే సురేశ్ రైనా అమ్ముడుపోకపోవడం. ఒకప్పుడు ఐపీఎల్‌ను శాసించిన అతన్ని.. ఈసారి ఒక్క ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. రూ. 2 కోట్ల బిడ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన రైనా కోసం ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపలేదు. బేస్‌ప్రైస్ వద్దే రిటైన్ చేసుకునే చాన్స్ ఉన్నా.. చెన్నై పట్టించుకోలేదు. యూఏఈలో జరిగిన ఎడిషన్‌లో అర్ధాంతరంగా తిరిగి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్, ఇమ్రాన్ తాహిర్, ఆదిల్ రషీద్, వేడ్, బిల్లింగ్స్, మహ్మద్ నబీ, డేవిడ్ మిల్లర్, సందీప్ లామిచానేను ఎవరూ పట్టించుకోలేదు. ఇండియా నుంచి ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, సాహాపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. మరి వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లను మళ్లీ కొనుక్కునే అవకాశం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అన్‌సోల్డ్ ఆటగాళ్లకు మరో చాన్స్ ఉంది. వేలం జరిగేటప్పుడు లేదా ముగిసిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు యాక్సిలరేటెడ్ రౌండ కింద వీరిని రీకాల్ చేయవచ్చు. ఒకవేళ ఇందులోనూ ఎవరూ తీసుకోకుంటే మరో అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో ఏదైనా ఫ్రాంచైజీలో ఆటగాడు గాయపడితే వారి స్థానంలో అమ్ముడుపోని ఆటగాళ్లను తీసుకునే చాన్స్ ఉంటుంది. గతంలో విండీస్ హిట్టర్ క్రిస్ గేల్‌ను ఆర్సీబీ ఇదే పద్దతిలో జట్టులోకి తీసుకుంది. -
హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్య 12 వేలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వీటిని విక్రయించేందుకు ఎంతలేదన్నా మరో 10 నెలల సమయం పడుతుంది. కరోనా థర్డ్ వేవ్ రాకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ వస్తే.. మరికొంత సమయం పట్టే అవకాశముంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రం గం పూర్తిగా ఐటీ రంగంపైనే ఆధారపడి ఉంది. చదవండి:Work From Home: వీకెండ్ హోమ్స్‌కు డిమాండ్ -
వృధా పదార్థాలు పడేయడంపై బ్యాన్
పారేసేది వాడెయ్యమన్నది నానుడి.. అంటే మనకు పనికి రానిది మరొకరికి ఉపయోగపడేలా చేయాలని అర్థం. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఇది వర్తిస్తుంది. వృధాగా పోయే పదార్థాలను ఆపన్నులకు అందించాలన్న సూత్రం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. పేదవారికి ప్రత్యేకంగా సహాయం అందించలేక పోయినా.. ఇటువంటి నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆహార పదార్థాలు వృధా చేయడంపై కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలోని అమ్ముడుపోని పదార్థాలను చెత్తబుట్టల్లోకి విసిరేయడంపై నిషేధం విధించారు. ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులను చెత్తబుట్టలకు తరలిస్తుంటారు. ఇటువంటి పోకడలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వస్తువులను వృధాగా పారేసేవారికి పరిమాణాన్ని బట్టి ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. అంతేకాదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడ విధిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎక్స్ పైరీ డేటుకు ముందే అనాధ శరణాలయాలకు, ఫుడ్ బ్యాంక్ లకు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు కూడ పాస్ చేశారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా 7.1 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుండటం కూడా ఈ బిల్లు అమల్లోకి రావడానికి కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ వృధా చేస్తున్న పదార్థాల్లో అమ్మకందార్లు 11 శాతం వృధా చేస్తుంటే... కొని పారేసే వారు 67 శాతం, రెస్టారెంట్ల లో తినకుండా వదిలేసేవారు 15 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటువంటివారికి భారీ జరిమానా విధించేందుకు ఈ కఠిన చట్టాన్నిఅమలుపరుస్తోంది. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. మరోపక్క అవసరానికి మించి ఆహారం కొనుగోలు చేసి వృధా చేసేవారూ అధికంగానే ఉన్నారు. దీన్ని అరికట్టాలన్నదే ఫ్రాన్స్ ప్రభుత్వ లక్ష్యం. అందుకే అక్కర్లేని పదార్థాలను సేవా సంస్థలు, ఆహార బ్యాంకులకు దానం చేయమని సూచిస్తోంది. పారిస్ కు దగ్గరలోని కౌర్బివాయి కౌన్సిలర్... ఆరాష్ దెరాంబర్ష్ ప్రవేశ పెట్టిన పిటిషన్ ను ఫ్రెంచ్ సెనేట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 400 స్క్వేర్ మీటర్లు, అంతకు మించి ఉన్న సూపర్ మార్కెట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం 3750 యూరోల జరిమానా విధిస్తుంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ఇదే చట్టాన్ని ఇప్పుడు యూరప్ లోని అన్ని సూపర్ మార్కెట్లకు వ్యాప్తి చేసేందుకు ఆరాష్ దెరాంబర్ష్ కృషి చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లలోని ఆహారం... వృధా కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అంటున్నారు.