నిన్న (నవంబర్ 24) ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా.. 20 మంది అన్ సోల్డ్‌గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు.
పాపం వార్నర్
నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జానీ బెయిర్‌స్టో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..!
దేవ్‌దత్ పడిక్కల్ (బేస్ ధర 2 కోట్లు)
డేవిడ్ వార్నర్ (2 కోట్లు)
జానీ బెయిర్‌స్టో (2 కోట్లు)
వకార్ సలామ్‌ఖిల్ (ఆఫ్ఘనిస్తాన్, 75 లక్షలు)
పియుశ్ చావ్లా (50 లక్షలు)
కార్తీక్ త్యాగి (40 లక్షలు)
యశ్ ధుల్ (30 లక్షలు)
అన్మోల్‌ప్రీత్ సింగ్ (30 లక్షలు)
ఉత్కర్శ్ సింగ్ (30 లక్షలు)
లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)
ఉపేంద్ర సింగ్ యాదవ్ (30 లక్షలు)
శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)
కాగా, తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి 467.85 కోట్లు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర.
నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ కేవలం రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment