ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఇందులో మొదటిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరు ఉంటుంది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఉంటారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లను క్రికెట్ సర్కిల్స్‌లో ఫాబ్ ఫోర్‌గా పిలుస్తారు. ఈ నలుగురితో పాటు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ పేర్లు కూడా అడపాదడపా వినిపిస్తుంటాయి.
సురేశ్ రైనా ఛాయిస్ ఎవరంటే..?
ఈ తరం అత్యుత్తమ ఆటగాడు ఎవరనే ప్రశ్నను టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎదుర్కొన్నప్పుడు సెకెను కూడా ఆలస్యం చేయకుండా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, జో రూట్ ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లని రైనా అభిప్రాయపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్ అనంతరం రైనా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.
ఈ సందర్భంగా రైనాతో పాటు పలువురు మాజీలు ఇదే ప్రశ్నను ఎదుర్కోగా.. ఒక్కొక్కరు ఒక్కో విధమైన కాంబినేషన్‌ను చూస్ చేసుకున్నారు. హర్భజన్ సింగ్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ల జాబితాలో జాక్ కలిస్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చేర్చగా.. ఆరోన్ ఫించ్.. రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చెప్పాడు. రాబిన్ ఉతప్ప.. వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారా పేర్లు చెప్పాడు.
ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో టీమిండియా ఛాంపియన్స్.. పాకిస్తాన్ ఛాంపియన్స్‌పై విజయం సాధించి, తొట్టతొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment