T20 World Cup 2024: అంతర్జాతీయ టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పునరాగమనంపై టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఈ ఇద్దరు స్టార్లను తిరిగి పిలిపించడం ద్వారా బీసీసీఐ తెలివైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్-2024 వేదికలైన అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లపై అనుభవజ్ఞులైన ఈ ఆటగాళ్ల అవసరం ఎంతగానో ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా 14 నెలల విరామం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి టీమిండియా తరఫున టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నారు. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో జరిగే సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. రోహిత్ సారథిగా ఆది నుంచే అందుబాటులో ఉండనున్నాడు.
అయితే, వీరిద్దరి రాక కారణంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కవనే విమర్శలు వస్తున్న తరుణంలో సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రపంచ కప్ టోర్నీకి వేదికలైన యూఎస్‌ఏ, వెస్టిండీస్‌లలో వికెట్లు కాస్త కఠినంగా ఉంటాయి.
అలాంటి సందర్భాల్లో టీమిండియాకు రోహిత్, కోహ్లి వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఉంటుంది. టీ20 క్రికెట్‌లో కోహ్లి 12 వేల పరుగులకు చేరువవుతాడు. అలాంటి బ్యాటర్ అందుబాటులో ఉంటే జట్టు మరింత పటిష్టమవుతుంది.
కోహ్లి వన్‌డౌన్లోనే బ్యాటింగ్ చేయాలి. కరేబియన్ పిచ్‌లపై ఆడుతున్నపుడు రోహిత్, కోహ్లి ఉంటేనే జట్టుకు ప్రయోజనకరం. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు దూకుడైన క్రికెట్ ఆడగలరు.
కానీ సీనియర్లు అది కూడా బ్యాటింగ్ దిగ్గజాలు ఉంటే జట్టు మరింత బలోపేతమవుతుంది. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని ముందుకు వెళ్లాలంటే రోహిత్- కోహ్లి ఉండాల్సిందే’’ అని సురేశ్ రైనా పీటీఐతో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో పది వేలకు పైగా పరుగులు సాధించగా.. కోహ్లి 11 వేలకు పైగా రన్స్ పూర్తి చేసుకున్నాడు.
చదవండి: Ishan Kishan: అప్పటి వరకు ఇషాన్‌కు టీమిండియాలో స్థానం లేదు.. హింటిచ్చిన ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment