
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు ఫైటింగ్ టార్గెట్‌ను (252) ఉంచింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది.
అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో రోహిత్ శర్మకు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లోనూ రోహిత్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ.
18 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 103/0గా ఉంది. రోహిత్‌తో (62 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) పాటు శుభ్‌మన్ గిల్ (46 బంతుల్లో 29; సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 149 పరుగులు చేయాలి.
ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో రోహిత్ శర్మ స్కోర్లు..
69*(62), 2025 CT
9(5), 2024 T20 WC
47(31), 2023 ODI WC
43(60), 2023 WTC
15(26), 2023 WTC
30(81), 2021 WTC
34(68), 2021 WTC
0(3), 2017 CT
29(26), 2014 T20 WC
9(14), 2013 CT
30*(16), 2007 T20 WC
Comments
Please login to add a commentAdd a comment