IPL 2023: No Place For AB de Villiers in Indian Legend All Time Xi - Sakshi
Sakshi News home page

IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్‌! కానీ..

Published Thu, Jan 26 2023 11:43 AM | Last Updated on Thu, Jan 26 2023 12:43 PM

IPL 2023: No Place For AB De Villiers In Indian Legend All Time XI But - Sakshi

ఏబీడీ- ధోని (PC: IPL)

Former Players All Time IPL XI: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా ఇండియన్‌ ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తన ఆటతో క్రికెట్‌ ప్రేమికులను అలరించాడు. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్‌.. 170 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ అత్యధిక స్కోరు 133.

ఇలా అద్భుత ప్రదర్శనతో తను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేసిన ఏబీడీకి టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే తన ఆల్‌టైం జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఐపీఎల్‌-2023 నేపథ్యంలో జియోసినిమా షో లెజెండ్స్‌ లాంజ్‌లో క్రిస్‌ గేల్‌, సురేశ్‌ రైనా, పార్థివ్‌ పటేల్‌, రాబిన్‌ ఊతప్ప, స్కాట్‌ స్టైరిస్‌ వంటి మాజీ క్రికెటర్లతో కలిపి పాల్గొన్నాడు అనిల్‌ కుంబ్లే.  

డివిలియర్స్‌ కోసం తనను పక్కనపెట్టలేను
ఈ సందర్భంగా... చర్చలో భాగంగా తమ ఆల్‌టైం ఐపీఎల్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను చెప్పాలని కోరగా.. కుంబ్లే.. డివిలియర్స్‌కు తన జట్టులో చోటు కష్టమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా జట్టుకు ఎంఎస్‌ ధోని కెప్టెన్‌. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. డివిలియర్స్‌ కోసం తనను పక్కనపెట్టలేను.

ఇక ఆరోస్థానంలో పొలార్డ్‌ను ఆడిస్తా’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు టైటిల్‌ గెలిచిన చెన్నై సారథి ధోనికే తన ఓటు అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇతరుల్లో గేల్‌ ఓపెనర్‌గా తన పేరును తాను సూచించగా.. పార్థివ్‌ పటేల్‌ అతడికి జోడీగా విరాట్‌ కోహ్లిని ఎంపిక చేశాడు. ఈ చర్చలో భాగంగా ఆఖర్లో పొలార్డ్‌ను కాదని డివిలియర్స్‌కే చోటిచ్చారు మిగతా మాజీలు.

లెజెండ్స్‌ ఎంపిక చేసిన ఆల్‌టైం ఐపీఎల్‌ జట్టు
క్రిస్‌ గేల్‌, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, సునిల్‌ నరైన్‌, యజువేంద్ర చహల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ.

చదవండి: Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!
ICC ODI Rankings: నంబర్‌ వన్‌ బౌలర్‌గా సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement