4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్న నలుగురు విధ్వంసకర ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్‌లు దాదాపుగా సమాప్తమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా వచ్చేఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా ఆక్షన్ అమ్ముడుపోని సరుకులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వారు జోస్యం చెబుతున్నారు.
ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్‌కే డాషింగ్ ప్లేయర్ సురేశ్ రైనా సహా ముగ్గురు విదేశీ విధ్వంసకర బ్యాటర్లు ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. విదేశీ బ్యాటర్ల లిస్ట్‌లో యూనివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందువరుసలో ఉంటాడని, అతని వెనకాలే కోల్‌కతా నైట్‌రైడర్స్ సారధి, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆతరువాత రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నలుగురితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన డానియల్ క్రిస్టియన్(ఆర్సీబీ-4.8 కోట్లు), రిలే మెరిడిత్(పంజాబ్ కింగ్స్-8 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(రాజస్థాన్ రాయల్స్-3 కోట్లు), టామ్ కర్రన్(ఢిల్లీ క్యాపిటల్స్-5.25 కోట్లు), జై రిచర్డ్‌సన్(పంజాబ్ కింగ్స్-14 కోట్లు)లు కచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చింది కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
చదవండి: మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment