PC:Sportzwiki Hindi
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు నాలుగేళ్లు దాటినప్పటకి తనలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ టీ10 లీగ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు.
ఈ లీగ్‌లో న్యూయార్క్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా.. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల మోత మోగించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.
ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌ను మిస్టర్ ఐపీఎల్ ఓ ఆట ఆడేసికున్నాడు. షకీబ్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రైనా ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడు మరోసారి బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రైనా.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక ఈ య్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రైనాతో పాటు ఉపుల్ తరంగా(40) పరుగులతో రాణించాడు. అనంతరం లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో న్యూయర్క్ లయన్స్ విజయం సాధించింది.
Suresh Raina makes a roaring entry on the NCL stage with a stroke-filled half-century that lifted New York Lions to 126. 🔥#NCLonFanCode pic.twitter.com/4IS8waiIdF
— FanCode (@FanCode) October 5, 2024
Comments
Please login to add a commentAdd a comment