ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను ఇండియా ఛాంపియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భారత్ ముద్దాడింది.
అయితే విజయనంతరం భారత మాజీ క్రికెటర్లు, డబ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ సరదగా డ్యాన్స్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీశారని ఈ ముగ్గురి క్రికెటర్లపై మండిపడింది.
అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారి చేసిన రీల్ వివాదస్పదం కావడంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భజ్జీ క్షమపణలు తెలిపాడు.
"ఇంగ్లండ్‌లో ఛాంపియన్‌షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ కమ్యూనిటీని మేము గౌరవిస్తాము.
15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయలేదు.
ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అందరికి నా తరపున క్షమపణలు తెలుపుతున్నాను. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment