Yuva raj singh
-
మమ్మల్ని క్షమించండి.. దయచేసి ఇక్కడితో ఆపేయండి: హర్భజన్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను ఇండియా ఛాంపియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భారత్ ముద్దాడింది.అయితే విజయనంతరం భారత మాజీ క్రికెటర్లు, డబ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ సరదగా డ్యాన్స్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీశారని ఈ ముగ్గురి క్రికెటర్లపై మండిపడింది.అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారి చేసిన రీల్ వివాదస్పదం కావడంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భజ్జీ క్షమపణలు తెలిపాడు."ఇంగ్లండ్‌లో ఛాంపియన్షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ కమ్యూనిటీని మేము గౌరవిస్తాము.15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అందరికి నా తరపున క్షమపణలు తెలుపుతున్నాను. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. -
6 బంతుల్లో 6 సిక్స్‌లు.. యువీని గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్ -23 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ ఫీట్ నమోదు చేశాడు. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు బాది వంశీ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మూడో బ్యాటర్‌గా.. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కృష్ణ నిలిచాడు. అతడి కంటే ముందు రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం భారత తరపున దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒక్కడే 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. మ్యాచ్ డ్రా.. ఇక ఆంధ్ర-రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ డ్రా అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రైల్వేస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలతో చెలరేగారు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ చివరిలో డ్రాగా ముగుస్తుంది. అన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలు, అంచిత్ యాదవ్ (133) సెంచరీలతో రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. 𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨 Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa. Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP — BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024 -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. వన్డే వరల్డ్‌కప్‌లోనే
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో స్పిన్నర్‌గా జడ్డూ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగిన జడేజా.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. ప్రోటీస్‌తో మ్యాచ్‌లో జడ్డూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ.. బౌలింగ్‌లో 33 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్ సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌పై 31 పరుగులిచ్చి యువీ 5 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత జడేజా ఈ ఘనతను అందుకోవడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 243 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: World cup 2023: మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్ జట్టు సెలక్షన్‌పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనుహ్యంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడంతో.. అశ్విన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. అశ్విన్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని యువీ అన్నాడు. కాగా అశ్విన్‌కు ఇది మూడో వన్డే ప్రపంచకప్. అంతకముందు 2011, 2015 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు అశ్విన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా టోర్నీల్లో 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 13 వికెట్లు పడగొట్టాడు. "అక్షర్ అందుబాటులో లేకపోవడంతో ఏడో స్ధానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సింది. అక్షర్ పటేల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది. మరో లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు జట్టులో ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతడిని ఎంపిక చేయలేదు. యుజ్వేంద్ర చాహల్‌ను అయినా తీసుకోవాల్సిందని" హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: భారత్, ఆసీస్, పాక్ కాదు.. ఆ జట్టే వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్ -
టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్ సింగ్ వారసుడెవరు?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు మరో 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం ప్రధాన జట్లు తమ వ్యూహాలను, అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా ఒకడుగు ముందుకు వేసి ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కూడా తమ జట్టును వెల్లడించేందుకు సిద్దమైంది. మరోవైపు సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సత్తాచాటాలని భారత జట్టు కూడా భావిస్తోంది. ఇక ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ 15 మంది సభ్యుల వివరాలను సెప్టెంబర్5 లోపు ఐసీసీకి సమర్పించాలి. అంటే ఇంకా 20 రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈ క్రమంలో భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్ కమిటీ పడింది. అయితే టోర్నీలో భాగమయ్యే భారత జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు అంత సులభం కాదు. ఎందుకంటే వన్డేల్లో నెం4 బ్యాటింగ్ సమస్య భారత జట్టును ఎప్పటి నుంచో వెంటాడుతోంది. యువీ వారసుడెవరు? ఏ జట్టుకైనా బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్ధానం చాలా కీలకం. టాపర్డర్ కుప్పకూలినప్పుడు జట్టును అదుకోవాల్సిన బాధ్యత నాలుగో స్ధానంలో వచ్చే ఆటగాడిది. అయితే భారత క్రికెట్లో మాత్రం నాలుగో స్ధానం అంటే టక్కున గుర్తుచ్చేంది మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్నే. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్.. తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పడు.. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ పాత్ర మరవలేనది. అయితే యువీ రిటైర్మెంట్ తర్వాత ఆ స్ధానానికి తగ్గ ఆటగాడు దొరకలేదు. అప్పటినుంచి భారత్‌కు నెం4 కష్టాలు మొదలయ్యాయి. అయితే కొన్నాళ్లపాటు అంబటి రాయుడు ఆ స్ధానంలో అలరించాడు. రాయుడు విజయవంతం కావడంతో నెం4 కష్టాలు తీరిపోయాయని అంతా భావించారు. కానీ 2019కు ప్రపంచకప్‌కు ముందు రాయుడు అనుహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో మళ్లీ భారత్‌కు నెం4 కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత చాలా మందిని ఆ స్ధానంలో భారత జట్టు మెన్మెజ్మెంట్ ట్రై చేసింది. అందులో అజింక్యా రహానే, దినేష్ కార్తీక్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కొన్నాళ్లు పాటు ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన భారత్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో పరిష్కారం దొరికింది. మిగితా వారితో పొలిస్తే అయ్యర్ ఆ స్ధానంలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అయ్యర్ 20 ఇన్నింగ్స్‌లలో 47.35 సగటుతో 805 పరుగులు సాధించాడు. అయితే ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు ముందు అయ్యర్ గాయపడడంతో మళ్లీ నెం4 కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన అయ్యర్.. దాదాపు 8 నెలల నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డేల్లో అతడి స్ధానాన్ని టీ20 నెం1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో జట్టు మెనెజ్‌మెంట్ ప్రయత్నించింది. కానీ భారత్‌కు నిరాశే ఎదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యి సూర్య తీవ్ర నిరాశపరిచాడు. అయితే మరో అప్షన్ లేకపోవడంతో ప్రస్తుతం సూర్యకుమార్‌నే భారత్ కొనసాగిస్తోంది. సూర్య తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవతున్నాడు. దీంతో అతడు ఆ స్ధానానికి సరిపోడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ ఐదుగురు ఈ క్రమంలో ప్రపంచకప్‌లో కీలకమైన నాలుగో స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. భారత సెలక్షన్ కమిటీకి ప్రస్తుతం ఐదు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో అయ్యర్, రాహల్ వంటి ఆటగాళ్ల ఫిట్నెస్ కూడా సెలక్టర్లను అందోళనకు గురిచేస్తోంది. కానీ యువ సంచలనం తిలక్ వర్మరూపంలో మరో ఎంపిక కూడా సెలక్టర్లకు దొరికింది. శ్రేయస్ అయ్యర్: వెన్నుగాయంతో జట్టుకు దూరమైన అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా సృష్టత లేదు. దీంతో అతడు వన్డే ప్రపంచకప్‌లో పాల్గోనడం అనుమానంగానే ఉంది. ఒకవేళ ఫిట్నెస్ టెస్టులో అయ్యర్ నెగ్గితే.. అతడిదే నాలుగో స్ధానం. కేఎల్ రాహుల్: టీమిండియా స్టార్ ఆటగాడు రాహుల్‌కు కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. కానీ ఐపీఎల్లో గాయపడిన రాహుల్ కూడా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉన్నాడు. అయితే అతడు పూర్తిస్ధాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే రాహుల్ ఆ స్ధానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సూర్యకుమార్ యాదవ్: టీ20ల్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో అతడివైపు జట్టు మెన్జ్మెంట్ మెగ్గు చూపే ఛాన్స్ లేదు. సంజూ శాంసన్.. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సంజూ శాంసన్‌కు నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మూడో వన్డేలో ఈ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ.. అద్బుతమైన అర్ధసెంచరీతో చెలరేగాడు. సంజూకు కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. అయితే అతడు వన్డేల్లో కూడా టీ20ల్లో ఈ స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున నాల తిలక్ వర్మ.. టీమిండియా యువ సంచలనం, హైదారాబాదీ తిలక్ వర్మ.. తన అరంగేట్ర సిరీస్‌లోనే అందరిని అకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ 20 ఏళ్ల హైదారాబాదీ తన సత్తా చూపించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ కమంలో అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడని వర్మను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. -
సూర్య అద్భుతమైన ఆటగాడు.. ప్రపంచకప్‌లో దుమ్ము రేపుతాడు: యువరాజ్
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్‌గా సూర్య వెనుదిరగాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డును కూడా నెలకొల్పాడు. ఇక ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకుమార్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. టీమిండియాకు సూర్యకుమార్ కీలక ఆటగాడని, వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తాడని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. "ప్రతీ క్రీడాకారుడు కెరీర్లో ఎత్తు పల్లాలు సహజం. ఏదో ఒక సమయంలో మనమందరం అనుభవించే ఉంటాం. భారత జట్టుకు సూర్య చాలా కీలకమైన ఆటగాడని నేను భావిస్తున్నాను. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు తన ఫామ్‌ను తిరిగి కచ్చితంగా పొందుతాడు. అదేవిధంగా రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో కూడా సూర్య అదరగొడతాడని నేను ఆశిస్తున్నాను. సూర్య మళ్లీ కచ్చితంగా మెరుస్తాడు" అని యువరాజ్ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్‌లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో కొమిల్లా విక్టోరియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో కొమిల్లా బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లను నరైన్ ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. కాగా సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నరైన్ రికార్డుల కెక్కాడు. ఇక నరైన్ కన్నా ముందు ఇంగ్లండ్ బ్యాటర్ మార్కస్ ట్రెస్కోతిక్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే నరైన్.. యువరాజ్ సింగ్ రికార్డును తృటిలో కోల్పోయాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. యవీతో పాటు క్రిస్ గేల్, హజ్రతుల్లా జాజాయ్ 12 బంతుల్లోనే అర్ధ శతకాలు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. చదవండి: 13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు.. సీఎస్కే ఫ్యాన్స్‌కు ఇక..! OMGHBFUEBFIOEBV... Brb, collecting our jaws from the floor! 🤯 📺 WATCH THE FASTEST-EVER 50 IN THE HISTORY OF #BPL ON #FANCODE 👉 https://t.co/zQb7mURAnc#BPLonFanCode #BBPL2022 @SunilPNarine74 pic.twitter.com/SJcxCojRg1 — FanCode (@FanCode) February 16, 2022 -
సిక్సర్ల రారాజు రీ ఎంట్రీ..?
ముంబై: యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడానికి సిద్దంమవుతున్నాడు. మెల్బోర్న్కు చెందిన ‘మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్’ తరుపున యువరాజ్ సింగ్ ఆడనున్నట్లు తెలుస్తోంది . యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసీస్ గడ్డపై బ్యాట్లు ఝుళిపించే అవకాశాలున్నాయి. వారితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే వీలుంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని మల్గ్రేవ్ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయెగమ్ పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్, సనత్ జయసూర్య, తరంగాలు మల్గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. దీంతో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయేగమ్ తెలిపారు. చదవండి: క్రికెట్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఫొటోలు -
ధోనితో ఉన్న వీడియో షేర్ చేసిన యువీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విటర్లో స్పందించారు. ధోనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మైదానంలో తనతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను యువీ షేర్ చేశారు. ‘నీ గోప్ప కేరీర్‌కు అభినందనలు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయంలో నీతోపాటు భాగస్వామిగా ఉండటం పట్ల ఎంతో ఆనందించాను. రిటైర్మెంట్ అనంతరం మంచి భవిష్యత్‌కు నీకివే నా శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ ఇచ్చారు యువీ. ఆయన షేర్ చేసిన వీడియోలో ధోనితో కలిసి దిగిన మరపురాని ఫొటోలు ఉన్నాయి. కాగా, మిడిల్ ఆర్డర్లో విజయవంతంగా రాణించిన యువీ, ధోని జంట టీ-20, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. (3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట) -
పక్షులను చూసి నేర్చుకోండి : యువీ
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పలు అసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తు ఉంటారు. తాజాగా ఆయన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు ప్రాముఖ్యతను తెలియజేసే ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక హంస సముద్రపు ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తన నోటితో తీస్తూ ఒక చోట వేస్తుంది. ‘పక్షలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో బాధపడటం చూడటం హృదయ విదారకం. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపి కలుషితం చేయడం ఆపేయాలి. ఇప్పుడు వాతావరణ మార్పుపై అవహన చాలా అవసరం. భూగ్రహన్ని ప్లాస్టిక్ కాలష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాడినికి కొత్త మార్గాలు వెతకాల్సిన సమయం వచ్చింది. అమాయకమైన పక్షులను చూసి పర్యావరణాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడుకునే విషయాలు చాలా నేర్చుకోవచ్చు. మనం ప్లాస్టిక్ కాలుష్యానికి కారణం కాకుండా.. నిర్మూలనకు ముందుకు రావాలని’ యువీ పేర్కొన్నారు. తాజాగా యువీ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వీడియో పలుసార్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినా.. ప్రస్తుతం యువీ పోస్ట్ చేయడంతో దాని ప్రాముఖ్యత పెరిగింది. దీనిపై ‘ప్లాస్టిక్ కాలుష్యం బాధాకరం’అంటూ ఒకరు, ‘వాతావరణంలో జరిగే ప్లాస్టిక్ కాలుష్యాన్ని మానవులు పటించుకోరు. కానీ పక్షులు మాత్రం కాలుష్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయని’ మరొకరు, ‘అందమైన భూమిని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడుకుందాం’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Heartbreaking to see them suffer this way. Plastic is choking our planet, we need to find ways to eliminate it. Let’s learn from these innocent birds and be a part of the Solution not part of the pollution. #StopOceanPlasticPollution #ClimateChangeIsReal pic.twitter.com/RMDjqQPL6t — yuvraj singh (@YUVSTRONG12) October 12, 2019 -
రిషభ్.. ఆ షాట్ ఎన్నిసార్లు చూడాలి?
మాంచెస్టర్: న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో కీలక సమయంలో చెత్త షాట్ ఆడి టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ తన వికెట్‌ను సమర్పించుకోవడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విమర్శలు గుప్పించాడు. ఆ చెత్త షాట్‌ను ఎన్నిసార్లు చూడాలి అంటూ విమర్శించాడు. బంతిని సరిగా అంచనా వేయకుండానే పదే పదే ఒకే తరహా షాట్ కొట్టి ఔట్ కావడాన్ని తప్పుబట్టాడు. ‘ రిషభ్ ఈ షాట్ ఎన్నిసార్లు చూడాలి. వరల్డ్‌కప్‌లో ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అదే షాట్ కొట్టడం.. పెవిలియన్ చేరడం పరిపాటిగా మారిపోయింది’ అని పీటర్సన్ విమర్శించాడు. కాగా, రిషభ్ పంత్‌ను యువరాజ్ సింగ్ వెనకేసుకొచ్చాడు. ‘రిషభ్ బాగా ఆడి ఉండకపోవచ్చు కానీ అతనికి 8 వన్డేలు ఆడిన అనుభవం ఉంది’ అని యువరాజ్ బదులిచ్చాడు. ఈ ఒక్క ఆట తీరుపై తనని విమర్శించడంలో సరికాదంటూ ట్వీట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పిటర్సన్ ట్వీట్‌కు స్పందిస్తూ ..పంత్ క్రికెట్ కెరీర్లో ఇంకా మొదటి దశలోనే ఉన్నాడని, తాను కూడా మొదట్లో తప్పులు చేశాను వాటిని నుంచి నేర్చుకోనే ఈ స్థాయికి వచ్చానంటూ పంత్‌కు మద్దతిచ్చాడు. ఏ పరిస్థితిలో తను ఆడలేక పోయాడో ఇప్పటికే తను తెలుసుకున్నాడని, ఇకపై పంత్ మెరుగైనా ప్రదర్శన కనపరస్తాడన్ననమ్మకం ఉందంటూ కోహ్లి పేర్కొన్నాడు. -
ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం!
ముంబై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం నాటి చిరస్మరణీయ ఘట్టాన్ని ఎవరు మరచిపోగలరు! 2011, ఏప్రిల్ 2న కులశేఖర బౌలింగ్‌లో ధోని కొట్టిన భారీ సిక్సర్‌తో భారతావని పులకించింది. ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టయిల్, ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్’... అంటూ సాగిన రవిశాస్త్రి వ్యాఖ్యానం ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు అదే ముంబైలోని వాంఖడే మైదానంలో నాటి జట్టులోని కొందరు సభ్యులు దానిని గుర్తు చేసుకొని సంబరపడ్డారు. నేడు ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో ఉన్న క్రికెటర్లు ఇచ్చోటనే... అంటూ తమ చిరకాల స్వప్నం నెరవేరిన రోజును తలచుకున్నారు. ముంబై మెంటార్లు సచిన్ టెండూ ల్కర్, జహీర్‌ఖాన్‌లతో యుువరాజ్ సింగ్ సెల్ఫీ దిగగా... మరో వైపు చెన్నై ఆటగాళ్లు ధోని, రైనా, హర్భజన్ కలిసి ఫోటోను పంచుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక వీడియో విడుదల చేసిన సచిన్ ప్రస్తుత జట్టు సభ్యులకు సందేశమిచ్చాడు. ‘త్వరలోనే మరో వరల్డ్ కప్ రాబోతోంది. మీలో ఎవరూ ఆడబోతున్నారో నాకు తెలీదు. కానీ ఎవరు ఆడినా గెలుపును కానుకగా తీసుకురండి. మీ జెర్సీలపై చూస్తే మూడు ప్రపంచ కప్ విజయాల స్టార్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగును చేయడం మీ చేతుల్లోనే ఉంది’ అని సచిన్ ఈ వీడియోలో వ్యాఖ్యానించాడు. గౌతం గంభీర్ కూడా బురదతో నిండిన తన ఫైనల్ మ్యాచ్ జెర్సీ ఫోటోను పెట్టి ‘కొన్ని జ్ఞాపకాల పుటలు మట్టితో అలంకరిస్తేనే బాగుంటుంది’ అని పోస్ట్ చేశాడు. -
నాలో సత్తా మిగిలే ఉంది
ముంబై: ఇటీవలి ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తనను తీసుకునేందుకు మొగ్గు చూపకపోవడంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఈ విషయం కొంత బాధించినా... తనలాంటి వారి కంటే కొత్త తరం ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు ఎక్కువ దృష్టిపెడతాయి కాబట్టి సర్దిచెప్పుకొన్నానని అతడు పేర్కొన్నాడు. 37 ఏళ్ల యువరాజ్‌ను మూడు రోజుల క్రితం జరిగిన వేలంలో రెండో రౌండ్లో రూ.కోటి ప్రాథమిక ధరకు ముంబై ఇండియన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘క్రికెట్ పట్ల వ్యామోహంతో పాటు నాలో ఇంకా సత్తా ఉంది కాబట్టే ఆడగలుగుతున్నా. ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నట్లు మనసులో ఏమూలనో ఉండేది. అదే జరగబోతోంది. ఫ్రాంచైజీ యజమాని అనంత్ అంబానీ నా గురించి మంచి మాటలు చెప్పడం మరింత ఆనందాన్నిచ్చింది. గతేడాది లీగ్‌లో పంజాబ్ తరఫున విఫలమైంది నిజమే. బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరమైన స్థానం లేకపోవడమే దీనికి కారణం. ఈసారి మాత్రం అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా. ముంబై ఫ్రాంచైజీలోని సచిన్, జహీర్, కెప్టెన్ రోహిత్‌లతో చాలా మ్యాచ్‌లు ఆడా. మనకు ఎవరైనా మద్దతుగా ఉంటే బాగా ఆడేందుకు అది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది’ అని వివరించాడు. -
నేడే ఐపీఎల్ వేలం
జైపూర్: జనరంజక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. 2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు మంగళవారం ‘పింక్ సిటీ’ జైపూర్ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 346 మంది నుంచి 70 మందిని ( 20 మంది విదేశీ, 50 మంది స్వదేశీ) లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. ఫ్రాంచైజీలన్నీ జనవరిలో నిర్వహించిన వేలంలో భారీ మార్పుచేర్పులు చేశాయి. దీంతో చిన్నపాటి కసరత్తుతోనే ఈ కార్యక్రమం ముగియనుంది. వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్ ఉన్నందున... లీగ్ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల సన్నాహాలకు, ప్రపంచ కప్ నాటికి క్రికెటర్లు తమ జాతీయ జట్లకు అందుబాటులో ఉండేలా డిసెంబరులోనే వేలం ముగించేస్తున్నారు. విదేశీయుల అందుబాటు ప్రధానం ఐపీఎల్ ముగింపు–ప్రపంచకప్‌నకు పెద్దగా వ్యవధి లేనందున న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ మినహా మిగతా దేశాల బోర్డులన్నీ తమ ఆటగాళ్లకు పరిమితంగానే అనుమతులిచ్చాయి. దీంతో వారు ఏ దశ వరకు అందుబాటులో ఉంటారనేదానిపై ఆయా జట్ల కోచ్‌లు, యజమానులు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ఇక్కడా? అక్కడా? ఎక్కడ? ఏప్రిల్–మే మధ్య దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్ నిర్వహణ ఎక్కడ అనేదానిపై జనవరి మూడోవారంలో బీసీసీఐ నుంచి స్పష్టత రానున్నట్లు సమాచారం. యువరాజ్... రూ.కోటికే! అయినా? ఒకనాడు రూ.16 కోట్లు అందుకున్న టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్... ప్రçస్తుతం రూ.కోటి ప్రాథమిక ధరకే వేలానికి వచ్చాడు. అయినప్పటికీ అతడిని ఎవరూ కొనే పరిస్థితి లేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లోని 9 మంది విదేశీయుల్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌పై అందరి దృష్టి ఉంది. 2018 సీజన్లో రూ.11.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన పేసర్ జైదేవ్ ఉనాద్కట్ ఇప్పుడు రూ.కోటిన్నర కనీస మొత్తానికే అందుబాటులోకి వచ్చాడు. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కుర్రాళ్లంతా స్టార్ క్రికెటర్లే!
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ భవిష్యత్తు క్రికెటర్లను తీర్చిదిద్దే టోర్నీ. ఆస్ట్రేలియా వేదికగా 1998లో యూత్ వరల్డ్‌కప్‌గా ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్ 4 ట్రోఫీలందుకొని ప్రథమ స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ టోర్నీ ద్వారా అనేక మంది కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు సాధించారు. ప్రతిభ కనభర్చిన ప్రతి ఒక్కరికి అవకాశం రాకున్నా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ప్రతి కుర్రాడు స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. గత 18 ఏళ్లుగా ఈ టోర్నీ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో భారత్ తొలి ప్రపంచకప్ సాధించగా యువరాజ్ మ్యాన్ఆఫ్ దిసిరీస్ అందుకున్నాడు. అనంతరం యువరాజ్ స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. భారత్ అందుకున్న టీ20 వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషించగా 2011 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 2002లో జింబాంబ్వే స్టార్ క్రికెటర్ టాటెండా టైబు మ్యాన్ ఆఫ్ దిసిరీస్ అందుకున్నాడు. 2004లో ప్రస్తుత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2006లో ప్రస్తుత టీమిండియా నయావాల్, టెస్టు స్పెషలిస్టు చతేశ్వరా పుజారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2008లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ టిమ్ సౌతి, 2010లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిక్స్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్లందుకున్నారు. 2012లో ఆస్ట్రేలియా క్రికెటర్ విలియమ్ బోసిస్టో అందుకోగా 2014లో ప్రస్తుత దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా నిలిచాడు. 2016లో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహిదీ హసన్ ఈ ఘనతను సోంతం చేసుకున్నాడు. ఇక 2018లో భారత యువకెరటం శుభ్‌మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డుల నేపథ్యంలో శుభ్‌మన్ సైతం త్వరలోనే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. -
సౌరాష్ట్ర టి20 టోర్నీలో జడేజా అద్భుతం
రాజ్‌కోట్: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రవిశాస్త్రికి, స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌లకు ఒకే సారూప్యత ఉంది. వీరిద్దరూ ఎడంచేతి వాటం స్పిన్నర్లే కాకుండా బ్యాట్‌తోనూ చెలరేగి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొనగాళ్లు. ఇప్పుడు ఈ ఇద్దరి సరసన మరో పేరు చేరింది. ఆ పేరే రవీంద్ర జడేజా. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు దూరమైన జడేజా తన సొంత జట్టు సౌరాష్ట్ర తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సీఏ) అంతర్ జిల్లా టి20 టోర్నమెంట్లో శుక్రవారం జడేజా అద్భుతం చేశాడు. అమ్రేలీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జామ్ నగర్ జట్టు తరఫున ఆడిన జడేజా కేవలం 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడి 154 పరుగులు సాధించాడు. ఆఫ్ స్పిన్నర్ నీలమ్ వంజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జడేజా ఆరు బంతులను ఆరు సిక్స్‌లుగా మలిచాడు. జడేజా అద్భుత ప్రదర్శనతో జామ్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 239 పరుగుల భారీ స్కోరు చేయగా... అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గతంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్... 1985 రంజీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌రాజ్ బౌలింగ్‌లో ముంబై తరఫున రవిశాస్త్రి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టారు. -
యూవీ కంటతడి.. చలించిన బిగ్ బీ
-
యూవీ కంటతడి.. చలించిన బిగ్ బీ
సాక్షి, స్పోర్ట్స్ : వివాద రహితుడిగా, తన రికార్డులతో అశేష అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్. అయితే కొన్నేళ్ల క్రితం యూవీ కేన్సర్ వ్యాధిని జయించాడు. ఆ సమయంలో తాను ఎదుర్కున్న అనుభవాలను మరోసారి నెమరువేసుకుని కంటతడి పెట్టుకున్నాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా కౌన్ బనేగా కరోడ్‌పతి 9వ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో కోసం నటి విద్యాబాలన్‌తో యూవీ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ యూవీ ఆ సమయంలో తాను ఎదుర్కున్న భయనక అనుభావాలను చెబుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ సారి నిద్రలేచే సరికి నోటి నుంచి ఎర్ర రంగులో తెమడ బయటికి రావటం, ఆ తర్వాత రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని యూవీ చెప్పాడు. క్రికెట్ మానేసి వెంటనే చికిత్స తీసుకోకపోతే ఎక్కువ కాలం బతికలేవని వైద్యులు చెప్పారని.. ఆ సమయంలో తాను నరకం చవి చూశానని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. యూవీ ఎమోషల్ మాటలకు చలించిన బిగ్ బీని, ఓదార్చిన విద్యాబాలన్‌ను ఈ మధ్య కేబీసీ వాళ్లు విడుదల చేసిన ఆ ప్రోమోలో చూడొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడ్డ యూవీ ప్రస్తుతం ఓ ఫౌండేషన్‌ను స్థాపించి కేన్సర్ బాధితులకు మనోధైర్యం అందిస్తూ రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. -
యువరాజ్‌కు అండగా కోహ్లి
తప్పించాలనుకుంటున్న బెంగళూరు నిర్ణయం మాల్యా చేతుల్లో బెంగళూరు: భారత ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోలేకపోయిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లుంది. గత ఏడాది రూ. 14 కోట్ల భారీ మొత్తానికి యువీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు అతడిని విడుదల చేయాలని ఆ జట్టు వ్యూహకర్తల బృందమైన క్రికెట్ కమిటీ భావిస్తోంది. ఇందులో మాజీ ఆటగాళ్లు బ్రిజేష్ పటేల్, అవినాశ్ వైద్య ఉన్నారు. అయితే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దీనిని గట్టిగా వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం వాయిదా పడింది. యువీ ఇప్పటికి మ్యాచ్ విన్నరే అంటూ కోహ్లి అతనికి మద్దతుగా నిలిచాడు. దాంతో తుది నిర్ణయాన్ని యజమాని విజయ్ మాల్యాకే ఫ్రాంచైజీ వదలి పెట్టింది. ఐపీఎల్-7లో యువరాజ్ 14 ఇన్నింగ్స్‌లో కలిపి 376 పరుగులు చేశాడు. యువీని విడుదల చేసి మరోసారి వేలంలో వెనక్కి తీసుకోవాలని ఆర్సీబీ వ్యూహంతో ఉంది. ఏ జట్టయినా అతడిని తక్కువ మొత్తానికి తీసుకున్నా...ఆ మొత్తం ఇచ్చి తీసుకునే మొదటి హక్కు బెంగళూరుకే ఉంటుంది కాబట్టి ఖర్చు తగ్గించుకునే దిశగా ఆలోచిస్తోంది. ఇక యువీని కొనసాగిస్తారా, పంపిస్తారా చూడాలి. ఢిల్లీ కూడా..: మరో వైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. పీటర్సన్ (రూ. 9 కోట్లు), మురళీ విజయ్ (రూ. 5 కోట్లు), మయాంక్ అగర్వాల్ (రూ. 1.6 కోట్లు)లను తప్పించాలనే ఆలోచనలో ఆ జట్టు యాజమాన్యం ఉంది. గత ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగున నిలిచింది. -
యువీ ఒత్తిడిలో ఆడేందుకు ఇష్టపడడు
తల్లి షబ్నమ్ సింగ్ వ్యాఖ్య షార్జా: భారత ఆటగాడు యువరాజ్‌సింగ్ ఒత్తిడిలో ఆడటానికి ఏమాత్రం ఇష్టపడడని అతని తల్లి షబ్నమ్ సింగ్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలోనే యువరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో అటువంటి వాతావరణం ఉన్నందున ఆ జట్టుకు ఎంపికైనందుకు యువీ ఎంతో సంతోషించాడని షబ్నమ్ తెలిపారు. వైఫల్యాలలో ఉన్నప్పుడు అతడిని ఒత్తిడికి గురిచేయకుండా ఒంటరిగా వదిలివేయడమే మంచిదని, అందరు తల్లిదండ్రుల్లాగే తానూ యువీని సమాధాన పర్చేందుకే ప్రయత్నిస్తుంటానని ఆమె చెప్పారు. యువరాజ్ చదువులో చాలా వెనకబడి ఉండేవాడని, ప్రతి పాఠశాలలోనూ అతని గురించి ఉపాధ్యాయులు తనకు ఫిర్యాదు చేసేవారని, చివరికి తనకు క్రికెట్ సరైనదన్న నిర్ణయానికొచ్చానని షబ్నమ్ వివరించారు. -
ప్రపంచకప్‌లో మన బౌలర్లు రాణిస్తారు!
యువరాజ్ సింగ్ ఆశాభావం కోల్‌కతా: ఇటీవల వన్డేల్లో భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా... ప్రపంచకప్‌లో రాణిస్తారని సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టి20 భిన్నమైన ఫార్మాట్ కాబట్టి వన్డే ప్రదర్శనతో పోల్చలేమని అన్నాడు. ‘వన్డేల్లో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల కారణంగా మన బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు. అయితే టి20లు వేరు. కాబట్టి ప్రపంచకప్‌లో వారు ఆకట్టుకోగలరు’ అని యువీ చెప్పాడు. టి20 మ్యాచ్ ఆఖరి 5-10 ఓవర్లలో చెలరేగే ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారని, తనతో పాటు ధోని, రైనా, రోహిత్, కోహ్లిలతో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ టీమిండియా సొంతమన్నాడు. యువరాజ్‌కు డోప్ పరీక్ష కోల్‌కతా: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బుధవారం క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు డోప్ పరీక్ష నిర్వహించింది. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనంతరం యువీనుంచి ‘నాడా’ శాంపిల్ తీసుకుంది. ఈ పరీక్ష ఫలితాలను త్వరలో బీసీసీఐకి అందజేస్తారు. యువీతో పాటు రైల్వేస్ కెప్టెన్ మహేశ్ రావత్‌కు కూడా డోప్ పరీక్ష జరిపారు.