చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. వన్డే వరల్డ్‌కప్‌లోనే | ODI WC 2023 IND Vs SA Highlights: Jadeja Becomes Second Indian Spinner To Take World Cup Fifer After Yuvraj Singh - Sakshi
Sakshi News home page

World Cup 2023 IND Vs SA: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. వన్డే వరల్డ్‌కప్‌లోనే

Published Sun, Nov 5 2023 10:52 PM | Last Updated on Mon, Nov 6 2023 9:59 AM

Jadeja Becomes second Indian spinner to take World Cup fifer after Yuvraj - Sakshi

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో స్పిన్నర్‌గా జడ్డూ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగిన జడేజా.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు.

ప్రోటీస్‌తో మ్యాచ్‌లో జడ్డూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన జడ్డూ.. బౌలింగ్‌లో 33 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్‌ సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఉన్నాడు.

2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌పై 31 పరుగులిచ్చి యువీ 5 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత జడేజా ఈ ఘనతను అందుకోవడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 243 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 
చదవండి: World cup 2023: మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement