
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్‌గా సూర్య వెనుదిరగాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డును కూడా నెలకొల్పాడు.
ఇక ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకుమార్‌కు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. టీమిండియాకు సూర్యకుమార్ కీలక ఆటగాడని, వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తాడని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.
"ప్రతీ క్రీడాకారుడు కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం. ఏదో ఒక సమయంలో మనమందరం అనుభవించే ఉంటాం. భారత జట్టుకు సూర్య చాలా కీలకమైన ఆటగాడని నేను భావిస్తున్నాను. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు తన ఫామ్‌ను తిరిగి కచ్చితంగా పొందుతాడు. అదేవిధంగా రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో కూడా సూర్య అదరగొడతాడని నేను ఆశిస్తున్నాను. సూర్య మళ్లీ కచ్చితంగా మెరుస్తాడు" అని యువరాజ్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?