టీ20ల్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో యంగ్ ఇండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.
టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా వికెట్ పడగొట్టారు.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
"మరో టీ20 సిరీస్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా టాపార్డర్ బ్యాటర్ల విఫలమైనందుకు మేము నిరాశ చెందలేదు. నిజంగా చెప్పాలంటే నేను కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మిడిలార్డర్ బ్యాటర్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని నేను భావించాను.
క్లిష్ట సమయంలో ఎలా ఆడుతారో పరీక్షించాలనకున్నాము. ముఖ్యంగా ఐదు, ఆరు, ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే వారు ఆటగాళ్లు జట్టుకు చాలా ముఖ్యం. ఒకవేళ టాపర్డర్ విఫలమైనా వారు జట్టును ఆదుకునే విధంగా ఉండాలి. అయితే ఈ మ్యాచ్‌లో నేను కోరుకున్న విధంగానే మా మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.
రింకూ, నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లను కూడా టెస్టు చేయాలనుకున్నాను. ప్రస్తుత తరం క్రికెట్‌లో జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
Comments
Please login to add a commentAdd a comment