బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.
128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదిపడేసింది. కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ( 39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, మెహాది హసన్ మిరాజ్ తలా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.
వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment