
శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్ దూరంగా ఉండాలని పాండ్యా నిర్ణయించకున్నట్లు సమాచారం.
ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకు హార్దిక్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. బీసీసీఐ కూడా హార్దిక్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంకతో వన్డేలకు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నాడు.
ఈ క్రమంలో లంకతో వన్డే సిరీస్‌లలో భారత జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అప్పగించాలని సెలక్టర్లు భావించారు. కానీ అంతలోనే హార్దిక్ కూడా వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగించాలని సెలక్టర్లు సతమతవుతున్నట్లు వినికిడి.
ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశముంది. లంకేయులతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథిగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో శ్రీలంకతో తలపడనుంది. పల్లెకెలె వేదికగా జూలై 27న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment