
భారత్-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. జూలై 27న పల్లెకెలె వేదికగా ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లురూతున్నాయి.
తొలి టీ20 కోసం తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. అయితే భారత జట్టు మాత్రం కొత్త హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్స్‌లో చెమటోడ్చారు.
అయితే నెట్ ప్రాక్టీస్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్నర్‌గా అవతరెమెత్తాడు. సాధరణంగా మీడియం పేసర్ బౌలర్ అయిన పాండ్యా.. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది భారత జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్ట్‌లు పెడుతున్నారు.
కాగా పాండ్యా కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. లంకతో వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరమయ్యాడు. అదేవిధంగా పాండ్యాను కాదని భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం విధితమే. ఇక పర్యటలో భాగంగా భారత్ లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Hardik pandya bowling practice in net session at Colombo!!!!!
New lege spinner in team india 🥰♥️#SLvIND #Cricket #IndianCricketTeam#hardikpandya pic.twitter.com/D2d21J8prh— Ashok BANA (@AshokBana_11) July 25, 2024