శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్‌ | Gautam Gambhir And Co reach Sri Lanka ahead of IND vs SL series | Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్‌

Published Mon, Jul 22 2024 6:21 PM | Last Updated on Mon, Jul 22 2024 7:49 PM

Gautam Gambhir And Co reach Sri Lanka ahead of IND vs SL series

శ్రీలంక‌తో ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌కు టీమిండియా సిద్ద‌మైంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో భార‌త్ మూడు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. జూలై 26న జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో టీమిండియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.

ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు సోమ‌వారం శ్రీలంక గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. తొలి బ్యాచ్‌గా సూర్యకుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త టీ20 జ‌ట్టు శ్రీలంక‌కు చేరుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా జ‌ట్టు వెంట ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

వ‌న్డే జ‌ట్టులో భాగ‌మైన ఆట‌గాళ్లు వారం రోజుల త‌ర్వాత లంక‌కు ప‌య‌నం కానున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్ర‌స్తుతం వేకేష‌న్‌లో స్టార్ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి నేరుగా శ్రీలంక‌కు చేరుకున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇక ప‌ర్య‌ట‌న‌తో భార‌త క్రికెట్‌లో కొత్త శ‌కం ఆరంభం కానుంది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నుండ‌గా.. హెడ్ కోచ్‌గా గంభీర్ ప్ర‌స్ధానం మొద‌లు కానుంది. వ‌న్డేల్లో రోహిత్ శ‌ర్మ‌నే భార‌త జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. అయితే ఈ ప‌ర్య‌ట‌నకు స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, రింకూ సింగ్‌, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, ఖలీల్ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్ అహ్మద్‌, హర్షిత్ రాణా.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement