టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, నూతన హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ తమ ప్రయణాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. జూలై 27న పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తో వీరిద్దరి ప్రస్ధానం మొదలు కానుంది.
రోహిత్ శర్మ స్ధానంలో భారత టీ20 కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టగా.. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీర్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్‌కోచ్ గంభీర్‌ను ఉద్దేశించి సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్‌తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు సూర్య తెలిపాడు.
"గౌతం గంభీర్‌తో నా బంధం చాలా ప్రత్యేకం. ఎందుకంటే నా ఐపీఎల్ అరంగేట్రంలో కేకేఆర్ తరపున గంభీర్ కెప్టెన్సీలోనే ఆడాను. కేకేఆర్ ఫ్రాంచైజీలో నాకు ఆడే అవకాశం రావడం నిజంగా చాలా గొప్పవిషయం. అక్కడ నుంచే నా కెరీర్ మలుపు తిరిగింది.
ఆ తర్వాత జాతీయ జట్టులో ఆడే అవకాశం నాకు లభించింది. మా మధ్య ఆ బంధం ఇప్పటికీ బలంగా ఉంది. నా మైండ్‌సెట్, పనితీరు ఎలా ఉంటుందో గంభీర్‌కు బాగా తెలుసు. అతడు కోచ్‌గా ఎలా పనిచేస్తాడో నాకు కూడా తెలుసు.
గంభీర్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మా మా ఇద్దరి కాంబినేషన్‌లో అన్ని మంచి ఫలితాలే రావాలని ఆశిస్తున్నట్లు" బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment