ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు అదరగొట్టింది.
నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.
చరిత్ర సృష్టించిన భారత్..
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్‌ను చూపించాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించి ఔరా అన్పించాడు. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ బంతిని పంచుకున్నారు. అయితే ఆ ఏడుగురు బౌలర్లలో ప్రతీ ఒక్కరు వికెట్ సాధించారు.
కాగా 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో ఏడుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా తీయడం ఇదే తొలిసారి. 1932లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు.. ఢిల్లీ టీ20 ముందు వరకు ఏ ఫార్మాట్(వన్డే, టీ20, టెస్టు)లో కూడా భారత జట్టు ఈ అరుదైన ఫీట్ నమోదు చేయలేదు. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో టెస్టుల్లో 4 సార్లు, వన్డేల్లో 10 సార్లు, టీ20ల్లో 4 సార్లు ఈ ఫీట్ నమోదు అయింది.
చదవండి: కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
Comments
Please login to add a commentAdd a comment