IND vs SA: ద‌క్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. వీడియో వైర‌ల్‌ | IND vs SA: Team India touchdowns Durban in style | Sakshi
Sakshi News home page

IND vs SA: ద‌క్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. వీడియో వైర‌ల్‌

Published Mon, Nov 4 2024 12:16 PM | Last Updated on Mon, Nov 4 2024 1:08 PM

IND vs SA: Team India touchdowns Durban in style

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మ‌రో క‌ఠిన స‌వాల్‌కు సిద్ద‌మైంది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు సోమ‌వారం స‌ఫారీ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. డర్బన్‌కు చేరుకున్న భార‌త జ‌ట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ఆధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ సిరీస్‌లో భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌ లక్ష్మణ్ వ్య‌హ‌రించ‌నున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ద‌మ‌వుతుండడంతో రెగ్యూల‌ర్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నవంబ‌ర్ 8న డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

అద్భుత ఫామ్‌లో టీమిండియా..
ఇక ఈ ఏడాదిలో టీ20ల్లో భార‌త్ క్రికెట్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. 2024 ఏడాదిలో 22 టీ20లు ఆడిన టీమిండియా కేవ‌లం ఒక్క మ్యాచ్‌లో మాత్ర‌మే ఓట‌మి చ‌విచూసింది. కొత్త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలో భారత జట్టు దూసుకుపోతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే జోరును కనబరచాలని యంగ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది.

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్. వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్‌టన్‌, ట్రిస్టన్ స్టబ్స్
చదవండి: IPL 2025: రిషబ్‌ పంత్‌కు రూ. 50 కోట్లు!?


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement