PC: cricketaddictor.com
దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శుక్రవారం డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 61 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో సఫారీలను చిత్తు చేసింది.
దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ప్రశాంతతను కోల్పోయాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, సూర్యకుమార్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రెండో బంతిని గెరాల్డ్ కోట్జీ లాంగ్-ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. బంతి బౌన్స్ అయి నేరుగా లాంగా ఆఫ్ ఫీల్డర్ చేతికి వెళ్లింది. వెంటనే సదరు ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు త్రో చేశాడు.
ఈ క్రమంలో ఆ బంతిని సంజూ పిచ్‌పై కుడివైపు నుండి అందుకున్నాడు. అయితే సంజూ పిచ్ మధ్యలోకి వచ్చి బంతి అందుకోవడం జాన్సెన్‌కు నచ్చలేదు. దీంతో అతడు శాంసన్‌తో వాగ్వాదానికి దిగాడు. శాంసన్ కూడా అతడికి బదులిచ్చాడు. ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సంజూ శాంసన్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. జాన్సెన్ వద్దకు వెళ్లి సీరియస్‌గా ఏదో అన్నాడు.
ఆ తర్వాత నాన్‌స్ట్రైక్‌లో ఉన్న గెరాల్డ్ కోయెట్జీ కూడా ఈ గొడవలో భాగమయ్యాడు. అయితే ఫీల్డ్ అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(107) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
Comments
Please login to add a commentAdd a comment