IND vs SA 2nd T20: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. | IND vs SA 2nd T20I: Will rain play spoilsport? | Sakshi
Sakshi News home page

IND vs SA 2nd T20: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌..

Published Sun, Nov 10 2024 12:14 PM | Last Updated on Sun, Nov 10 2024 1:12 PM

IND vs SA 2nd T20I: Will rain play spoilsport?

ఆదివారం గెబేహా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టీ20లో భార‌త్‌-దక్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే జోరును కొన‌సాగించాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు మొద‌టి టీ20లో ఓట‌మి చవిచూసిన స‌ఫారీ జ‌ట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా టీమిండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాల‌ని యోచిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశ‌ముంది. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభ సమయానికి గెబేహాలో 50 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే  సూచనలు కన్పిస్తున్నాయి. 

కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అదే విధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా వరుణుడు ఇబ్బంది కలిగించే అస్కారం ఉన్నట్లు స్ధానిక వాతవారణ శాఖ కూడా ఓ ప్రకటనలో వెల్లడిం‍చింది. ఒకవేళ పూర్తి స్థాయిలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. కనీసం 5 ఓవర్ల గేమ్‌నైనా ఆడిస్తారు. అలా కూడా కుదరకపోతే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేస్తారు.

తుది జట్లు(అంచనా)
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అవేష్ ఖాన్
చదవండి: CK Nayudu Trophy: ఊచ‌కోత‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement