దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టును 61 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 141 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా మూడు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(107) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(33), సూర్యకుమార్ యాదవ్(21) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
"డర్బన్‌లో మాకు మంచి రికార్డు ఉందన్న విషయం నాకు తెలియదు. ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. గత మూడు నాలుగు సిరీస్‌ల నుంచి మేం మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాం. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.
ఇక సంజూ శాంసన్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఈ మ్యాచ్‌లో తన స్కోర్ 90లలో ఉన్నప్పుడు కూడా అతడు బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాడు. సంజూ ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టు ప్రయోజానాల కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడు.
మ్యాచ్ కీలక దశలో స్పిన్నర్లను ఎటాక్‌లోకి తీసుకురావాలని ముందే ప్లాన్ చేశాము. క్లాసెన్, మిల్లర్ క్లాసెన్, మిల్లర్ వికెట్లను స్పిన్నర్లతో తీయాలనుకున్నాం. మా స్పిన్నర్లు మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నారా?
అవును నా కెప్టెన్సీని నేను ఆస్వాదిస్తున్నాను. మా కుర్రాళ్లు అద్బుతంగా ఆడి నా పనిని మరింత సులువు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టాస్, ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో చెప్పాను. ప్రస్తుతం నాపై ఎటువంటి ఒత్తడి లేదు. మా బాయ్స్ అంతా ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాను. వికెట్లు కోల్పోయినప్పటకీ భయపడకుండా ఆడుతున్నాము. మా బ్రాండ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాము అని సూర్య చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment