జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. కాగా సూర్యకు ఇది నాలుగో టీ20 సెంచరీ కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ(4), గ్లేన్ మ్యాక్స్‌వెల్(4) సరసన సూర్య నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్‌లో విరోచిత శతకంతో చెలరేగిన సూర్యకుమార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 79 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.
తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును మిస్టర్ 360 బ్రేక్ చేశాడు. కాగా మ్యాక్స్‌వెల్ తన నాలుగు సెంచరీల మార్క్‌ను 92 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ కూడా సూర్యనే కావడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Suryakumar Yadav: 'నేను బాగానే ఉన్నాను.. అతడు పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు'
सूर्य कुमार यादव में ताकत और नजाकत दोनों है, जिस दक्षिण अफ्रीका की पिच से भारतीय बल्लेबाज डरते है उसी पिच पर सूर्या का तूफानी शतक
— Surya Samajwadi (@surya_samajwadi) December 14, 2023
अब तो मान लो सूर्य कुमार यादव जैसा T20 खिलाड़ी कोई नही है #SuryakumarYadavpic.twitter.com/iPj9Dx81Oh
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘
— BCCI (@BCCI) December 14, 2023
There is no stopping @surya_14kumar!
Mr. 360 brings up his 4th T20I century in just 55 balls with 7x4 and 8x6. The captain is leading from the front!🙌🏽👌🏽https://t.co/s4JlSnBAoY #SAvIND pic.twitter.com/t3BHlTiao4
Comments
Please login to add a commentAdd a comment