టీ20ల్లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. జూలై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని మరి సూర్యకు భారత జట్టు పగ్గాలు బీసీసీఐ అప్పగించింది.
ఇక కెప్టెన్‌గా ఎంపికయ్యాక తొలిసారి సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని, మద్దతుగా నిలుస్తున్న అభిమానులందరికి సూర్య ధన్యవాదాలు తెలిపాడు.
"మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడని. నాకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజుల నుంచి అంత కలగానే ఉంది. దేశం కోసం ఆడటం ఎల్లప్పుడూ నా దృష్టిలో ప్రత్యేకమే. భారత జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఫీలింగ్ వేరు. మాటల్లో వర్ణించలేని ఓ అనుభూతి.
కొత్త పాత్రను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. నాపై ఇక నుంచి చాలా బాధ్యత ఉంటుంది. ఎప్పటిలాగే ఇక ముందు కూడా మీ నుంచి నాకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆ దేవుని దయకూడా నాపై ఉందంటూ సూర్య సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment