ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ అదిల్ రషీద్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసినందుకు సంతోషంగా ఉందని సూర్య చెప్పుకొచ్చాడు.
"సిరీస్‌ను విజయంతో ఆరంభించినందుకు సంతోషంగా ఉంది. మా విజయంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు సత్పలితాలను ఇచ్చింది. ఆరంభంలోనే అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టి మాకు ఒక ప్లాట్ ఫామ్ సెట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో మా బౌలర్లందరూ తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. ఆ తర్వాత మా బ్యాటర్లు కూడా అద్బుతంగా ఆడారు. గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై ఇదే తరహా బ్యాటింగ్ చేశాము. ముఖ్యంగా అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు ముందే తెలుసు.
ఇక కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సిన బాధ్యత హార్దిక్ పాండ్యాపై ఉందని మాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాము. ముగ్గురు స్పిన్నర్లు కూడా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ అదనపు బాధ్యతలు తీసుకుని రాణిస్తున్నాడు. మాకు గౌతీ భాయ్(గౌతం గంభీర్) పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. మేము టీ20 వరల్డ్‌కప్-2024 కంటే కొంచెం భిన్నంగా ఆడాలనుకుంటున్నాము. ఫీల్డింగ్‌లో కూడా మేము చాలా మెరుగుపడ్డాము. అందుకోసం సెషన్లలో ఫీల్డింగ్ కోచ్‌తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నాము. హాఫ్ ఛాన్స్‌లను కూడా క్యాచ్‌లగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment