వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించాడు.
జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం లెక్కచేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 37 బంతల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు తన హాఫ్ సెంచరీని శర్మ కేవలం 17 బంతుల్లోనే అందుకున్నాడు.
ఓవరాల్‌గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో ఈ పంజాబీ క్రికెటర్ సత్తాచాటాడు. ఇక సెంచరీతో చెలరేగిన శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..
👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన అభిషేక్.. గిల్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
👉టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్దానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంకపై హిట్‌మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే శతకొట్టాడు.
👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 13 సిక్స్‌లు కొట్టిన అభిషేక్.. రోహిత్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
బటీ20ల్లో ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండేది. ఫించ్ ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన శర్మ.. ఫించ్ రికార్డును బద్దలు కొట్టాడు.
భారత్ విజయ భేరి..
ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ విజయంతో ముగించింది. ఆఖరి టీ20లో 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(135)తో పాటు.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. వుడ్ రెండు, అర్చర్,రషీద్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
చదవండి: తొలి కల నెరవేరింది
Comments
Please login to add a commentAdd a comment