టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనుహ్యంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడంతో.. అశ్విన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
అశ్విన్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని యువీ అన్నాడు. కాగా అశ్విన్‌కు ఇది మూడో వన్డే ప్రపంచకప్. అంతకముందు 2011, 2015 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టు అశ్విన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా టోర్నీల్లో 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 13 వికెట్లు పడగొట్టాడు.
"అక్షర్ అందుబాటులో లేకపోవడంతో ఏడో స్ధానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సింది. అక్షర్ పటేల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది. మరో లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు జట్టులో ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతడిని ఎంపిక చేయలేదు. యుజ్వేంద్ర చాహల్‌ను అయినా తీసుకోవాల్సిందని" హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: భారత్, ఆసీస్, పాక్ కాదు.. ఆ జట్టే వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్
Comments
Please login to add a commentAdd a comment