
ముంబై: యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడానికి సిద్దంమవుతున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ‘మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్’ తరుపున యువరాజ్ సింగ్ ఆడనున్నట్లు తెలుస్తోంది . యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసీస్ గడ్డపై బ్యాట్లు ఝుళిపించే అవకాశాలున్నాయి. వారితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే వీలుంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని మల్‌గ్రేవ్ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయెగమ్ పేర్కొన్నారు.
ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు దిల్షాన్, సనత్ జయసూర్య, తరంగాలు మల్‌గ్రేవ్ జట్టులో ఆడనున్నారు. ఇంకొంత మంది సమర్థమంతమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు కృషి చేస్తున్నాం. దీంతో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయేగమ్ తెలిపారు.
చదవండి: క్రికెట్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఫొటోలు
Comments
Please login to add a commentAdd a comment