
యువీ ఒత్తిడిలో ఆడేందుకు ఇష్టపడడు
తల్లి షబ్నమ్ సింగ్ వ్యాఖ్య
షార్జా: భారత ఆటగాడు యువరాజ్‌సింగ్ ఒత్తిడిలో ఆడటానికి ఏమాత్రం ఇష్టపడడని అతని తల్లి షబ్నమ్ సింగ్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలోనే యువరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని, ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో అటువంటి వాతావరణం ఉన్నందున ఆ జట్టుకు ఎంపికైనందుకు యువీ ఎంతో సంతోషించాడని షబ్నమ్ తెలిపారు.
వైఫల్యాలలో ఉన్నప్పుడు అతడిని ఒత్తిడికి గురిచేయకుండా ఒంటరిగా వదిలివేయడమే మంచిదని, అందరు తల్లిదండ్రుల్లాగే తానూ యువీని సమాధాన పర్చేందుకే ప్రయత్నిస్తుంటానని ఆమె చెప్పారు. యువరాజ్ చదువులో చాలా వెనకబడి ఉండేవాడని, ప్రతి పాఠశాలలోనూ అతని గురించి ఉపాధ్యాయులు తనకు ఫిర్యాదు చేసేవారని, చివరికి తనకు క్రికెట్ సరైనదన్న నిర్ణయానికొచ్చానని షబ్నమ్ వివరించారు.