shabnam singh
-
అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం!
మతపరమైన ఆంక్షలన్నింటినీ దాటుకుని ముంబై నుంచి శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరిన షబ్నం ఇప్పుడు అయోధ్యకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆమె హలియాపూర్‌లోని అయోధ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన కల నిజమవుతున్న తరుణమని అన్నారు. కొద్దిసేపటిలో రామ్‌లల్లా దర్శనం చేసుకోబోతున్నానన్నారు. షబ్నం షేక్‌కు హాలియాపూర్‌లో స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ముంబైలో ఉంటున్న షబ్నమ్ షేక్ (23) బీకామ్ విద్యార్థిని. రామునిపై ఆమెకు ఉన్న భక్తిప్రపత్తులను ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటారు. 38 రోజుల క్రితం ఆమె తన ముగ్గురు హిందూ స్నేహితులైన రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరారు. శనివారం సాయంత్రం హాలియాపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర స్థానికులు వారికి స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రతాప్ ధాబా నిర్వాహకుడు హరి ప్రతాప్ సింగ్, అతని భార్య ప్రీతి సింగ్ షబ్నం బృందానికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని వారు కోరారు. షబ్నం వారి అభ్యర్థనను అంగీకరించారు. ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలినని, అయోధ్యకు సమీపానికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని, ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకుంటానన్నారు. -
నేనంటే యువరాజ్ తల్లికి హడల్
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబం గురించి అతని సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ రోజుకో బాంబు పేలుస్తోంది. యువీ కుటుంబంపై వరుసగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. యువీ తల్లి షబ్నం సింగ్‌కు తానంటే భయమని, వాళ్ల కుటుంబం గురించి తాను ఏమి చెబుతానోనని హడలిపోతోందని ఆకాంక్ష చెప్పింది. అయితే తాను జొరావర్ నుంచి విడాకులు మాత్రమే కోరుకుంటున్నానని వెల్లడించింది. జొరావర్, ఆకాంక్ష రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా మనస్ఫర్థల కారణంగా పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోయారు. రియల్టీ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న ఆకాంక్ష సంచలన విషయాలు వెల్లడించింది. జొరావర్‌కు, తనకు విభేదాల్లేవని, షబ్నం కారణంగానే తాము విడిపోయామని ఇటీవల ఆకాంక్ష ఆరోపించింది. ఇదే షోలో ఆమె మాట్లాడుతూ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడంటూ మరో బాంబు పేల్చింది. 'నేను చేస్తున్న ఆరోపణలు నిజంకాబట్టే షబ్నం భయపడుతోంది. నేను అబద్ధాలు చెప్పినట్టయితే ఆమె అంత తీవ్రంగా స్పందించేది కాదు. షబ్నం కుటుంబం నుంచి నేనేమీ కోరుకోవడం లేదు. కేవలం విడాకులు ఇవ్వాలని చెబుతున్నా. నా జీవితం నేను గడపాలని భావిస్తున్నా' అని ఆకాంక్ష చెప్పింది. కాగా ఆకాంక్ష ఆరోపణల్ని యువీ కుటుంబం ఖండించింది. ఆకాంక్ష తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తమ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందని షబ్నం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆకాక్ష ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది. -
ఆ క్రికెటర్ గంజాయి తాగేవాడు!
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడని బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ తెలిపింది. యువరాజ్‌సింగ్ తమ్ముడు జోరావర్‌ను పెళ్లాడి.. కొంతకాలానికి వీడిపోయిన ఆమె గతంలో యూవీ తల్లిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన ఆమె 'బాలీవుడ్‌లైఫ్.కామ్'తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించింది. తాను గంజాయి తాగేవాడినని యూవీ స్వయంగా తనకు చెప్పినట్టు ఆమె చెప్పుకొచ్చింది. యువరాజు తల్లి చేతిలో మీరు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని అడుగగా.. "వారి ఇంట్లో వేధింపులు సహజంగానే ఉండేవి. దీంతో నేను కూడా కలిసి నా భర్తతో గంజాయి తాగాల్సి వచ్చింది. యూవీ కూడా తాను గంజాయి దమ్ము పీల్చేవాడినని నాకు చెప్పాడు. ఇది ఇండస్ట్రిలో సర్వసాధారణమైన విషయం. ఈ విషయాలు నేను వెల్లడించడంతో మా అత్తయ్య తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు' అని పేర్కొన్నారు. యూవీ తల్లి, తన అత్తయ్య అయిన షబ్నం సింగ్ తనను సరిగా చూడలేదని, ఆమె వల్ల తమ వైవాహిక జీవితం ముక్కలైందని ఆకాంక్ష శర్మ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన షబ్నంసింగ్ ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడనని గతంలో వివరణ ఇచ్చారు. -
యువరాజ్‌సింగ్ తల్లిపై ఆమె తీవ్ర ఆరోపణలు..!
గుర్గావ్కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ గురించి నిన్నటివరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆదివారం రాత్రి ప్రసారమైన బిగ్‌బాస్ టీవీషోలో ఆమె పలు విస్మయకర విషయాలు తెలిపారు. తాను గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. తమ పెళ్లి కేవలం నాలుగు నెలలకే విచ్ఛిన్నమైందని, దీంతో అత్తవారింటి నుంచి తాను తిరిగొచ్చినట్టు తెలిపారు. యువరాజ్‌సింగ్ తల్లి, తన అత్త అయిన షబ్నంసింగ్యే తమ పెళ్లి పెటాకులు కావడానికి కారణమని, ఆమె కారణంగానే తాను భర్త నుంచి విడిపోయినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. బిగ్‌బాస్ షో పోటీదారు అయిన ఆమె అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో యూవీ తల్లి షబ్నంసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆకాంక్ష శర్మ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆమె పెళ్లి విషయం కోర్టు పరిధిలో ఉందని, కాబట్టి ఆ వివరాలు తాను వెల్లడించలేనని చెప్పారు. భర్తతో విడిపోయి రెండున్నరేళ్లు గడచిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆకాంక్ష శర్మ ఆరోపణలు చేస్తున్నదని ఆమె ప్రశ్నించారు. ‘ఇది గతంలోనే ఆమె చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ఇప్పుడు వేదిక (బిగ్‌బాస్ షో) దొరికినందుకు ఆమె ఇవన్నీ విషయాలు చెప్తోంది’ అని షబ్నం సింగ్ అన్నారు. వారి వైవాహిక బంధం విడిపోవడానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి వస్తుందని తనకు తెలుసునని, అది తానే అని నిందించినా పర్వాలేదని, కానీ ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. -
మా ఆయనకు అమ్మాయిల పిచ్చి!
షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితుడు పీటర్ ముఖర్జియా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని కూడా అతడి మాజీ భార్య షబ్నమ్ సింగ్ తెలిపారు. పీటర్ ముఖర్జియాకు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి అని ఆమె చెప్పారు. ‘‘పీటర్‌కు అసలు నైతిక విలువలు అనేవి లేవు. అతడి చుట్టూ ఎప్పుడూ వయసులో ఉన్న అమ్మాయిలు ఉండాల్సిందే. లేట్ నైట్ పార్టీలంటే అతడికి చాలా ఇష్టం. అతడి జీవితంలో చాలామంది మహిళలున్నారు. అసలు అందుకే నేను విడాకులు తీసుకున్నాను’’ అని ఆమె పోలీసు విచారణలో వెల్లడించారు. ఆమె చాలా కాలం క్రితమే ఈ విషయాలను సీబీఐకి చెప్పినా, ఇన్నాళ్ల పాటు ఆ ప్రకటన కాపీలను రహస్యంగా ఉంచారు. వాటిని ఇటీవలే పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలాకు, ఇంద్రాణి ముఖర్జియా తరఫు న్యాయవాది గంజన్ మంగ్లాకు అప్పగించారు. కాగా, షబ్నమ్ సింగ్ వెల్లడించిన విషయాల్లో ఈ కేసుకు సంబంధం లేని మరో అంశం కూడా ఉంది. అయితే.. ఆ విషయం బయటకు వస్తే సంబంధిత వ్యక్తి పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయని అంటున్నారు. పీటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించడంతో షబ్నమ్ సింగ్‌కు భద్రత కల్పించాలని ప్రత్యేక కోర్టు జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఆదేశించారు. తాను ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు.. పీటర్ తన ఇంటికి వస్తానన్నాడని, అప్పుడు వేరే అమ్మాయితో వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వచ్చిన మహిళను తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేశాడని.. ఆమె పేరు ఇంద్రాణి అని తన వాంగ్మూలంలో తెలిపారు. అప్పుడే ‘నువ్వు బాగుపడవు’ అని పీటర్‌తో అన్నానన్నారు. ఇంద్రాణి గత చరిత్ర గురించి తెలిసి కూడా పీటర్ ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. -
యువీ ఒత్తిడిలో ఆడేందుకు ఇష్టపడడు
తల్లి షబ్నమ్ సింగ్ వ్యాఖ్య షార్జా: భారత ఆటగాడు యువరాజ్‌సింగ్ ఒత్తిడిలో ఆడటానికి ఏమాత్రం ఇష్టపడడని అతని తల్లి షబ్నమ్ సింగ్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలోనే యువరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో అటువంటి వాతావరణం ఉన్నందున ఆ జట్టుకు ఎంపికైనందుకు యువీ ఎంతో సంతోషించాడని షబ్నమ్ తెలిపారు. వైఫల్యాలలో ఉన్నప్పుడు అతడిని ఒత్తిడికి గురిచేయకుండా ఒంటరిగా వదిలివేయడమే మంచిదని, అందరు తల్లిదండ్రుల్లాగే తానూ యువీని సమాధాన పర్చేందుకే ప్రయత్నిస్తుంటానని ఆమె చెప్పారు. యువరాజ్ చదువులో చాలా వెనకబడి ఉండేవాడని, ప్రతి పాఠశాలలోనూ అతని గురించి ఉపాధ్యాయులు తనకు ఫిర్యాదు చేసేవారని, చివరికి తనకు క్రికెట్ సరైనదన్న నిర్ణయానికొచ్చానని షబ్నమ్ వివరించారు.