ఆ క్రికెటర్‌ గంజాయి తాగేవాడు! | Akansha Sharma alleges Yuvraj Singh used to smoke ganjai | Sakshi
Sakshi News home page

ఆ క్రికెటర్‌ గంజాయి తాగేవాడు!

Published Mon, Oct 31 2016 5:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

ఆ క్రికెటర్‌ గంజాయి తాగేవాడు!

ఆ క్రికెటర్‌ గంజాయి తాగేవాడు!

టీమిండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ గంజాయి తాగేవాడని బిగ్‌బాస్‌ 10 కంటెస్టెంట్‌ ఆకాంక్ష శర్మ తెలిపింది. యువరాజ్‌సింగ్‌ తమ్ముడు జోరావర్‌ను పెళ్లాడి.. కొంతకాలానికి వీడిపోయిన ఆమె గతంలో యూవీ తల్లిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్‌ షో నుంచి బయటకొచ్చిన ఆమె 'బాలీవుడ్‌లైఫ్‌.కామ్‌'తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించింది. తాను గంజాయి తాగేవాడినని యూవీ స్వయంగా తనకు చెప్పినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

యువరాజు తల్లి చేతిలో  మీరు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని అడుగగా.. "వారి ఇంట్లో వేధింపులు సహజంగానే ఉండేవి. దీంతో నేను కూడా కలిసి నా భర్తతో గంజాయి తాగాల్సి వచ్చింది. యూవీ కూడా తాను గంజాయి దమ్ము పీల్చేవాడినని నాకు చెప్పాడు. ఇది ఇండస్ట్రిలో సర్వసాధారణమైన విషయం. ఈ విషయాలు నేను వెల్లడించడంతో మా అత్తయ్య తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు' అని పేర్కొన్నారు. యూవీ తల్లి, తన అత్తయ్య అయిన షబ్నం సింగ్‌ తనను సరిగా చూడలేదని, ఆమె వల్ల తమ వైవాహిక జీవితం ముక్కలైందని ఆకాంక్ష శర్మ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన షబ్నంసింగ్‌ ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడనని గతంలో వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement