akansha sharma
-
‘ఆకాంక్షను నేనే చంపాను’
కోల్ కతా: ఆకాంక్ష శర్మను తానే చంపానని మూడు హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఉదయన్ దాస్ ఒప్పుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని బాంకురా జిల్లా కోర్టు ముందు నేరాన్ని అంగీకరించాడు. తనతో పాటు సహజీవనం చేసిన ఆకాంక్షను భోపాల్ లో హత్య చేసినట్టు కోర్టుకు తెలిపాడు. నేరాన్ని అంగీకరించిన ఉదయన్ బెయిల్ అభ్యర్థన పెట్టుకునేందుకు నిరాకరించాడు. కోర్టులో విచారణ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయన్ అమాయకుడని, అతడికి ఏమీ సంబంధం లేదని అతడి తరపు న్యాయవాది ఆరుప్ కుమార్ నంది నిరూపించే ప్రయత్నం చేశారు. ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని వాదించారు. మధ్యలో జోక్యం చేసుకున్న ఉదయన్ నేరం అంగీకరించాడు. తన యావదాస్తిని ఆకాంక్ష పేరుతో ఏర్పాటు చేసే ట్రస్టుకు రాసిస్తానని చెప్పాడు. భోపాల్ లోని ఇల్లు, తన తల్లి ఆభరణాలు, తండ్రి ఫిక్సిడ్ డిపాజిట్లు కూడా ట్రస్టుకు ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. ఈ ట్రస్టుకు బాంకురా పోలీసులను ట్రస్టీలుగా పెట్టాలని అభ్యర్థించాడు. మరణశిక్షను తప్పించుకునేందుకే ఉదయన్ ఈ నాటకం ఆడుతున్నాడని ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆకాంక్షతో పాటు సొంత తల్లిదండ్రులు కూడా ఉదయన్ హతమార్చాడు. -
‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా..
భోపాల్: సోషల్ మీడియా పరిచయం ఓ 28 ఏళ్ల మహిళ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ప్రేమించాడని నమ్మి అతడి వద్దకు వెళ్లిన ఆమెతో కొద్ది రోజులు గడిపి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతునులిమి చంపి ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆకాంక్ష శర్మ అనే మహిళ (28) బెంగాల్‌కు చెందినామె. ఆమెకు ఉద్యాన్ దాస్ అనే వ్యక్తికి ఆన్లైన్ ద్వారా పరిచయం అయింది. గత ఏడాది వీరిపరిచయం కాస్త ఒకరినొకరు ఉండలేనంత స్థాయికి చేరింది. దీంతో తాను అమెరికా వెళుతున్నానని ఆకాంక్ష ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వెళ్లాక తాను అమెరికాలోనే ఉన్నట్లుగా ఫోన్లో రోజూ మాట్లాడింది. దీంతో ఆమె మాటల్ని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు. అయితే, వాస్తవానికి ఆమె అమెరికా వెళ్లకుండా ఆన్లైన్లో పరిచయం అయిన దాస్ వద్దకు వెళ్లింది. డిసెంబర్ వరకు ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రాలేదు. వాళ్లు చేసినా ఫోన్ కలవలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సిగ్నల్స్ ట్రాక్ చేసి చూడగా భోపాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో మరింత అనుమానించిన పోలీసులు నేరుగా దాస్ ఇంటికి వెళ్లారు. అతడిని విచారించి ఇళ్లంతా గాలించారు. అనంతరం నట్టింట్లో కాంక్రీట్‌తో కట్టిన నిర్మాణం గుర్తించి దానిని పెద్దపెద్ద డ్రిల్లింగ్స్ పెట్టి పగులగొట్టి చూడగా అందులో నుంచి ఆకాంక్ష మృతదేహం బయటపడింది. రెండు నెలల కిందట తమకు గొడవ అయిందని దాంతో తానే గొంతునులిమి చంపి ఓ మెటల్ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్ వేసి కప్పెట్టానని నిజం ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
నేనంటే యువరాజ్ తల్లికి హడల్
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబం గురించి అతని సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ రోజుకో బాంబు పేలుస్తోంది. యువీ కుటుంబంపై వరుసగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. యువీ తల్లి షబ్నం సింగ్‌కు తానంటే భయమని, వాళ్ల కుటుంబం గురించి తాను ఏమి చెబుతానోనని హడలిపోతోందని ఆకాంక్ష చెప్పింది. అయితే తాను జొరావర్ నుంచి విడాకులు మాత్రమే కోరుకుంటున్నానని వెల్లడించింది. జొరావర్, ఆకాంక్ష రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా మనస్ఫర్థల కారణంగా పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోయారు. రియల్టీ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న ఆకాంక్ష సంచలన విషయాలు వెల్లడించింది. జొరావర్‌కు, తనకు విభేదాల్లేవని, షబ్నం కారణంగానే తాము విడిపోయామని ఇటీవల ఆకాంక్ష ఆరోపించింది. ఇదే షోలో ఆమె మాట్లాడుతూ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడంటూ మరో బాంబు పేల్చింది. 'నేను చేస్తున్న ఆరోపణలు నిజంకాబట్టే షబ్నం భయపడుతోంది. నేను అబద్ధాలు చెప్పినట్టయితే ఆమె అంత తీవ్రంగా స్పందించేది కాదు. షబ్నం కుటుంబం నుంచి నేనేమీ కోరుకోవడం లేదు. కేవలం విడాకులు ఇవ్వాలని చెబుతున్నా. నా జీవితం నేను గడపాలని భావిస్తున్నా' అని ఆకాంక్ష చెప్పింది. కాగా ఆకాంక్ష ఆరోపణల్ని యువీ కుటుంబం ఖండించింది. ఆకాంక్ష తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తమ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందని షబ్నం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆకాక్ష ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది. -
ఆ క్రికెటర్ గంజాయి తాగేవాడు!
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడని బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ తెలిపింది. యువరాజ్‌సింగ్ తమ్ముడు జోరావర్‌ను పెళ్లాడి.. కొంతకాలానికి వీడిపోయిన ఆమె గతంలో యూవీ తల్లిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన ఆమె 'బాలీవుడ్‌లైఫ్.కామ్'తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించింది. తాను గంజాయి తాగేవాడినని యూవీ స్వయంగా తనకు చెప్పినట్టు ఆమె చెప్పుకొచ్చింది. యువరాజు తల్లి చేతిలో మీరు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని అడుగగా.. "వారి ఇంట్లో వేధింపులు సహజంగానే ఉండేవి. దీంతో నేను కూడా కలిసి నా భర్తతో గంజాయి తాగాల్సి వచ్చింది. యూవీ కూడా తాను గంజాయి దమ్ము పీల్చేవాడినని నాకు చెప్పాడు. ఇది ఇండస్ట్రిలో సర్వసాధారణమైన విషయం. ఈ విషయాలు నేను వెల్లడించడంతో మా అత్తయ్య తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు' అని పేర్కొన్నారు. యూవీ తల్లి, తన అత్తయ్య అయిన షబ్నం సింగ్ తనను సరిగా చూడలేదని, ఆమె వల్ల తమ వైవాహిక జీవితం ముక్కలైందని ఆకాంక్ష శర్మ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన షబ్నంసింగ్ ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడనని గతంలో వివరణ ఇచ్చారు.