‘ఆన్‌లైన్‌’ ప్రేయసిని అతి దారుణంగా.. | Man She Met Online Confesses To Burying Her In Concrete | Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్‌’ ప్రేయసిని అతి దారుణంగా..

Published Fri, Feb 3 2017 3:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

‘ఆన్‌లైన్‌’ ప్రేయసిని అతి దారుణంగా..

‘ఆన్‌లైన్‌’ ప్రేయసిని అతి దారుణంగా..

భోపాల్‌: సోషల్‌ మీడియా పరిచయం ఓ 28 ఏళ్ల మహిళ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ప్రేమించాడని నమ్మి అతడి వద్దకు వెళ్లిన ఆమెతో కొద్ది రోజులు గడిపి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతునులిమి చంపి ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆకాంక్ష శర్మ అనే మహిళ (28) బెంగాల్‌కు చెందినామె. ఆమెకు ఉద్యాన్‌ దాస్‌ అనే వ్యక్తికి ఆన్‌లైన్‌ ద్వారా పరిచయం అయింది. గత ఏడాది వీరిపరిచయం కాస్త ఒకరినొకరు ఉండలేనంత స్థాయికి చేరింది.

దీంతో తాను అమెరికా వెళుతున్నానని ఆకాంక్ష ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వెళ్లాక తాను అమెరికాలోనే ఉన్నట్లుగా ఫోన్‌లో రోజూ మాట్లాడింది. దీంతో ఆమె మాటల్ని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు. అయితే, వాస్తవానికి ఆమె అమెరికా వెళ్లకుండా ఆన్‌లైన్‌లో పరిచయం అయిన దాస్‌ వద్దకు వెళ్లింది. డిసెంబర్‌ వరకు ఇంట్లో వాళ్లతో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌ రాలేదు. వాళ్లు చేసినా ఫోన్‌ కలవలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సిగ్నల్స్‌ ట్రాక్‌ చేసి చూడగా భోపాల్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

దీంతో మరింత అనుమానించిన పోలీసులు నేరుగా దాస్‌ ఇంటికి వెళ్లారు. అతడిని విచారించి ఇళ్లంతా గాలించారు. అనంతరం నట్టింట్లో కాంక్రీట్‌తో కట్టిన నిర్మాణం గుర్తించి దానిని పెద్దపెద్ద డ్రిల్లింగ్స్‌ పెట్టి పగులగొట్టి చూడగా అందులో నుంచి ఆకాంక్ష మృతదేహం బయటపడింది. రెండు నెలల కిందట తమకు గొడవ అయిందని దాంతో తానే గొంతునులిమి చంపి ఓ మెటల్‌ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్‌ వేసి కప్పెట్టానని నిజం ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
 



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement