udyan Das
-
ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా..
భోపాల్: సోషల్ మీడియాలో పరిచయమైన ప్రేయసిని దారుణంగా హత్య చేసి, ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పాతిపెట్టిన భోపాల్ వాసి ఉద్యాన్ దాస్ పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు చెప్పాడు. ఏడేళ్ల క్రితం తన తల్లిదండ్రులను కూడా ఇలాగే చంపి, ఇంట్లో శవాలను పాతిపెట్టినట్టు నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉద్యాన్ దాస్.. తన దగ్గరకు వచ్చిన ఆన్ లైన్ ఫ్రెండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆకాంక్ష శర్మతో కొన్ని రోజులు కలిసున్న తర్వాత గొడవపడి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె శవాన్ని ఓ మెటల్ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్ వేసి కప్పెట్టాడు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2010లో చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తన తల్లిదండ్రులను ఇదే రీతిలో చంపినట్టు ఉద్యాన్ వెల్లడించాడు. వారి శవాలను ఇంట్లో పాతిపెట్టినట్టు చెప్పాడు. వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకున్నందుకు వారిని హత్య చేసినట్టు తెలిపాడు. భోపాల్ పోలీసులు ఈ విషయాన్ని రాయ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. రాయ్‌పూర్‌లో హత్య జరిగిన ఇంట్లో ఆదివారం మృతదేహాలను వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. ఉద్యాన్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు. వారికి భోపాల్, రాయ్ పూర్, ఢిల్లీలో మూడు ఇళ్లు ఉన్నాయి. వారిని హత్య చేసిన తర్వాత భోపాల్ వెళ్లాడు. ఇళ్ల అద్దెల ద్వారా నెలకు 80 వేల రూపాయలు వస్తుందని పోలీసులు తెలిపారు. తండ్రి మరణించినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుని, తల్లికి 30 వేల రూపాయలు పెన్షన్ వచ్చేలా చేశాడని, జాయింట్ బ్యాంకు ఎకౌంట్ ద్వారా ఈ డబ్బును డ్రా చేసేవాడని చెప్పారు. ‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా.. -
‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా..
భోపాల్: సోషల్ మీడియా పరిచయం ఓ 28 ఏళ్ల మహిళ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ప్రేమించాడని నమ్మి అతడి వద్దకు వెళ్లిన ఆమెతో కొద్ది రోజులు గడిపి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతునులిమి చంపి ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆకాంక్ష శర్మ అనే మహిళ (28) బెంగాల్‌కు చెందినామె. ఆమెకు ఉద్యాన్ దాస్ అనే వ్యక్తికి ఆన్లైన్ ద్వారా పరిచయం అయింది. గత ఏడాది వీరిపరిచయం కాస్త ఒకరినొకరు ఉండలేనంత స్థాయికి చేరింది. దీంతో తాను అమెరికా వెళుతున్నానని ఆకాంక్ష ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వెళ్లాక తాను అమెరికాలోనే ఉన్నట్లుగా ఫోన్లో రోజూ మాట్లాడింది. దీంతో ఆమె మాటల్ని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు. అయితే, వాస్తవానికి ఆమె అమెరికా వెళ్లకుండా ఆన్లైన్లో పరిచయం అయిన దాస్ వద్దకు వెళ్లింది. డిసెంబర్ వరకు ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రాలేదు. వాళ్లు చేసినా ఫోన్ కలవలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సిగ్నల్స్ ట్రాక్ చేసి చూడగా భోపాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో మరింత అనుమానించిన పోలీసులు నేరుగా దాస్ ఇంటికి వెళ్లారు. అతడిని విచారించి ఇళ్లంతా గాలించారు. అనంతరం నట్టింట్లో కాంక్రీట్‌తో కట్టిన నిర్మాణం గుర్తించి దానిని పెద్దపెద్ద డ్రిల్లింగ్స్ పెట్టి పగులగొట్టి చూడగా అందులో నుంచి ఆకాంక్ష మృతదేహం బయటపడింది. రెండు నెలల కిందట తమకు గొడవ అయిందని దాంతో తానే గొంతునులిమి చంపి ఓ మెటల్ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్ వేసి కప్పెట్టానని నిజం ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.