ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా.. | Bhopal man who murdered, buried partner, admits to killing parents too | Sakshi
Sakshi News home page

ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా..

Published Sat, Feb 4 2017 8:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా..

ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా..

భోపాల్‌: సోషల్‌ మీడియాలో పరిచయమైన ప్రేయసిని దారుణంగా హత్య చేసి, ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పాతిపెట్టిన భోపాల్‌ వాసి ఉద్యాన్ దాస్ పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు చెప్పాడు. ఏడేళ్ల క్రితం తన తల్లిదండ్రులను కూడా ఇలాగే చంపి, ఇంట్లో శవాలను పాతిపెట్టినట్టు నేరం అంగీకరించాడు.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఉద్యాన్ దాస్‌.. తన దగ్గరకు వచ్చిన ఆన్ లైన్ ఫ్రెండ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆకాంక్ష శర్మతో కొన్ని రోజులు కలిసున్న తర్వాత గొడవపడి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె శవాన్ని ఓ మెటల్‌ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్‌ వేసి కప్పెట్టాడు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 2010లో చత్తీస్గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తన తల్లిదండ్రులను ఇదే రీతిలో చంపినట్టు ఉద్యాన్ వెల్లడించాడు. వారి శవాలను ఇంట్లో పాతిపెట్టినట్టు చెప్పాడు. వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకున్నందుకు వారిని హత్య చేసినట్టు తెలిపాడు. భోపాల్‌ పోలీసులు ఈ విషయాన్ని రాయ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు.

రాయ్‌పూర్లో హత్య జరిగిన ఇంట్లో ఆదివారం మృతదేహాలను వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. ఉద్యాన్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు. వారికి భోపాల్‌, రాయ్‌ పూర్, ఢిల్లీలో మూడు ఇళ్లు ఉన్నాయి. వారిని హత్య చేసిన తర్వాత భోపాల్‌ వెళ్లాడు. ఇళ్ల అద్దెల ద్వారా నెలకు 80 వేల రూపాయలు వస్తుందని పోలీసులు తెలిపారు. తండ్రి మరణించినట్టు డెత్ సర్టిఫికెట్‌ తీసుకుని, తల్లికి 30 వేల రూపాయలు పెన్షన్ వచ్చేలా చేశాడని, జాయింట్‌ బ్యాంకు ఎకౌంట్‌ ద్వారా ఈ డబ్బును డ్రా చేసేవాడని చెప్పారు.
 

‘ఆన్‌లైన్‌’ ప్రేయసిని అతి దారుణంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement