strangle
-
కళ్లు మూసుకొమ్మని భార్యని ఏం చేశాడంటే..
న్యూఢిల్లీ: అప్పటికే వారిద్దరి మధ్య పెద్ద గొడవ. తీవ్ర కోపంతో భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఫైటింగ్‌కు స్వస్తి పలకాలని, ఆ గొడవ మర్చిపోయేందుకు ఆమెకు గొప్ప బహుమతి ఇస్తానని నమ్మబలికాడు. పార్క్‌కు పిలిపించాడు. ఇద్దరు కలుసుకున్నాక కొద్ది సేపు కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ప్రేమగా పిలిచి అప్యాయంగా దగ్గరకు తీసుకొని తనవైపునకు తిప్పుకొంటూ ఆమెను ఆశ్చర్యపరచబోతున్నానని, కళ్లు మూసుకోవాలని చెప్పాడు. దాంతో తన భర్త నెక్లెస్ తీసుకొచ్చాడని ఆమె సంతోషపడింది. ఆమె అలా కళ్లు మూసుకుందో లేదో వెంటనే ఓ వైరును తీసుకొని ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మనోజ్ కుమార్ వ్యక్తి కోమల్ అనే యువతిని రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ వివాహం. కానీ, రెండేళ్లలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కోమల్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ మనోజ్‌కుమార్ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాడు. అదే విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవవుతోంది. ఈ క్రమంలో వారిద్దరు కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారు. దీంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని కుట్ర పన్నిన మనోజ్.. మరోసారి గొడవకు ముగింపు పలుకుదామనే నెపంతో ఆమెకు ఫోన్ చేసి ఉత్తర ఢిల్లీలోని బోంటా పార్క్ రమ్మని పిలిచాడు. అంగీకరించిన కోమల్ అక్కడికి వచ్చాక అతడు ముందుగానే కంజ్వాలాలో కొనుగోలు చేసిన వైరుతో మాయమాటలు చెప్పి గొంతుకు బిగించి హత్య చేసి పారిపోయాడు. ఆ వెంటనే ఫుల్లుగా మద్యం తాగుతూ జరిగిన సంగతిని అతడి స్నేహితులకు వివరిస్తుండగా అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతడిని అనుమానించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పెద్ద మొత్తం అడవిలాగ ఉండే ఆ పార్క్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు కూడా ఆరుగంటలు పట్టింది. ఎక్కడ చంపివేశాడనే చోటును కూడా అతడు గుర్తించలేకపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
నాడు రేప్ చేశారు.. నేడు గొంతుపిసికి చంపారు!
లక్నో: ఆమె ఒక అత్యాచార బాధితురాలు. తనపై నేరం జరిగి మూడేళ్లవుతున్నా విచారణ పూర్తవలేదు. పైగా ప్రతి విచారణలో దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. పోలీసులు చేసిన దర్యాప్తుపై ఆమెకు నమ్మకం లేదు. అందుకు కారణం తనపై లైంగిక దాడికి పాల్పడినవారిలో ఓ రాజకీయనాయకుడు కూడా ఉన్నాడని ఆమె చెప్పింది. వీటన్నింటిని ఎదుర్కొంటున్న ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి విగత జీవిగా ఇప్పుడు కనిపించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గొంతునులిమి చంపేశారు. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తానాపూర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతిపై 2013లో ఎనిమిదిమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. వీరిలో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరుణ్ వర్మ కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె తండ్రి కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇదే చెప్పాడు. బాధితురాలు కూడా పోలీసులకు ఈ మేరకు వివరణ ఇచ్చింది. అయితే, అప్పటి నుంచి విచారణలు చేపట్టిన పోలీసులు అరుణ్ వర్మను ప్రశ్నించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చారు. పైగా ప్రతిపక్ష నాయకులు తనపై కుట్రలు చేసి ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కాకుండా మిగితా నిందితులు కూడా ఆయా విచారణల్లో తప్పించుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే బాధితురాలు శనివారం సాయంత్రం ఇంటి బయట ఉన్న వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది. ఎవరో గొంతునులిమి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొంతునులిమి చంపేశారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడినవారే ఈ చర్యకు దిగి ఉంటారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో వీరి కుటుంబానికి పోలీసుల రక్షణ ఉండేది. ఇటీవలే విత్‌డ్రా చేసుకున్నారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే ఈ దారుణం జరిగింది. -
‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా..
భోపాల్: సోషల్ మీడియా పరిచయం ఓ 28 ఏళ్ల మహిళ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ప్రేమించాడని నమ్మి అతడి వద్దకు వెళ్లిన ఆమెతో కొద్ది రోజులు గడిపి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతునులిమి చంపి ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆకాంక్ష శర్మ అనే మహిళ (28) బెంగాల్‌కు చెందినామె. ఆమెకు ఉద్యాన్ దాస్ అనే వ్యక్తికి ఆన్లైన్ ద్వారా పరిచయం అయింది. గత ఏడాది వీరిపరిచయం కాస్త ఒకరినొకరు ఉండలేనంత స్థాయికి చేరింది. దీంతో తాను అమెరికా వెళుతున్నానని ఆకాంక్ష ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వెళ్లాక తాను అమెరికాలోనే ఉన్నట్లుగా ఫోన్లో రోజూ మాట్లాడింది. దీంతో ఆమె మాటల్ని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు. అయితే, వాస్తవానికి ఆమె అమెరికా వెళ్లకుండా ఆన్లైన్లో పరిచయం అయిన దాస్ వద్దకు వెళ్లింది. డిసెంబర్ వరకు ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ రాలేదు. వాళ్లు చేసినా ఫోన్ కలవలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సిగ్నల్స్ ట్రాక్ చేసి చూడగా భోపాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో మరింత అనుమానించిన పోలీసులు నేరుగా దాస్ ఇంటికి వెళ్లారు. అతడిని విచారించి ఇళ్లంతా గాలించారు. అనంతరం నట్టింట్లో కాంక్రీట్‌తో కట్టిన నిర్మాణం గుర్తించి దానిని పెద్దపెద్ద డ్రిల్లింగ్స్ పెట్టి పగులగొట్టి చూడగా అందులో నుంచి ఆకాంక్ష మృతదేహం బయటపడింది. రెండు నెలల కిందట తమకు గొడవ అయిందని దాంతో తానే గొంతునులిమి చంపి ఓ మెటల్ బాక్స్‌లో పెట్టి కాంక్రీట్ వేసి కప్పెట్టానని నిజం ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
'నువ్వు బయట ఉంటే అమ్మాయిలకు డేంజర్'
కలిసిన తొలిరోజే ప్రియురాలిని దారుణంగా చంపి ఆమె శవంతో ఫొటోలు దిగిన కార్ల్ లాంగ్డెల్ అనే ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. అతడు బయట ఉంటే సమాజానికి అత్యంత డేంజర్ అని వ్యాఖ్యానించింది. అతడు మహిళ పాలిట ఓ భయంకరమైన ఛీడపురుగు అని నిర్ధారించుకున్నాడని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాటీ లాక్ (23) అనే టీచర్‌కు ఓ ఆన్ లైన్ సంస్థ ద్వారా కార్ల్ లాండ్డెన్ అనే వ్యక్తికి పరిచయం అయ్యింది. అలా పరిచయం అయిన రెండు వారాల్లో వారు చాలా దగ్గరయ్యారు. క్రిస్టమస్ సందర్భంగా గత ఏడాది హెర్ట్ ఫోర్డ్ షైర్ లోని తియోబాల్డ్ పార్క్ హోటల్లో కలుసుకునేందుకు వచ్చారు. ఆ రాత్రంతా హోటల్లో ఓ గది తీసుకొని శారీరకంగా గడపాలని అనుకున్నారు. అయితే, వాస్తవానికి తానొక న్యాయ సంస్థను నడుపుతున్నానని చెప్పిన లాంగ్డెల్ ఓ మానసిక రోగి. అంతకుముందు నుంచే చికిత్స పొందుతున్నాడు. అతడికి ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు చిర్రెత్తిపోయి ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్న లాంగ్డెల్ మాయమాటలు చెప్పి ఆ టీచర్ ను బుట్టలో వేసుకున్నాడు. పథకం ప్రకారమే హోటల్ కు తీసుకెళ్లాడు. కానీ, అతడి ప్రవర్తన ముందుగానే గమనించి అప్రమత్తమయ్యేలోగానే.. అతడు శారీరకంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. లైంగిక వాంఛలు తీర్చుకొని గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంతో కలిసి ఫొటోలు దిగాడు. తిరిగి ఏమీ తెలియనట్లుగా ఆమె మృతదేహాన్ని అక్కడే పొదల్లో పడేశాడు. ఈ కేసును విచారించిన జడ్జీ కేసు పూర్వపరాలు చూసి అవాక్కయ్యారు. తీర్పు సందర్భంగా ఏం చెప్పారంటే 'నీలాంటి వారిని బయటకు వదిలితే మహిళలకు.. అమ్మాయిలకు చాలా సమస్యలు. నీకు నువ్వు ఈ సమాజానికి ఛీడపురుగుగా, విశృంఖల వ్యక్తిగా నిరూపించుకున్నావు. కాతీ విషయంలో ఇది రుజువైంది. ఇంత దుర్మార్గంగా ఎవరూ వ్యవహరించరు. నువ్వు జీవితాంతం జైలులో ఉండటమే సరైనది' అని వ్యాఖ్యానించారు.