నాడు రేప్ చేశారు.. నేడు గొంతుపిసికి చంపారు!
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తానాపూర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతిపై 2013లో ఎనిమిదిమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. వీరిలో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరుణ్ వర్మ కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె తండ్రి కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇదే చెప్పాడు. బాధితురాలు కూడా పోలీసులకు ఈ మేరకు వివరణ ఇచ్చింది. అయితే, అప్పటి నుంచి విచారణలు చేపట్టిన పోలీసులు అరుణ్ వర్మను ప్రశ్నించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చారు.
పైగా ప్రతిపక్ష నాయకులు తనపై కుట్రలు చేసి ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కాకుండా మిగితా నిందితులు కూడా ఆయా విచారణల్లో తప్పించుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే బాధితురాలు శనివారం సాయంత్రం ఇంటి బయట ఉన్న వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది. ఎవరో గొంతునులిమి చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయి.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొంతునులిమి చంపేశారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడినవారే ఈ చర్యకు దిగి ఉంటారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో వీరి కుటుంబానికి పోలీసుల రక్షణ ఉండేది. ఇటీవలే విత్‌డ్రా చేసుకున్నారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే ఈ దారుణం జరిగింది.