Royal Challengers
-
ఎలిమినేటర్ మ్యాచ్
-
సీఎస్కే జెర్సీ వేసుకుంటానంటే నా భార్య ఊరుకోలేదు..!
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఐపీఎల్ సీజన్ అనేది వాళ్ళకి ఒక పండగలాంటి వాతావరణం. పైగా వాళ్ల అభిమాన ఆటగాళ్లు గెలవాలని పూజలు, మొక్కులు అంటూ రకరకాల వెర్రి అభిమానంతో వాళ్లు చేసే హంగామాలు అంత ఇంత అని చెప్పలేం. అయితే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి అభిమాని మ్యాచ్‌లోని ఇరు జట్లలోని తమ అభిమాన స్టార్ ఆటగాళ్లపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రతి నిమిషం ఉత్కంఠతో తమ స్టార్ ఆటగాడు జట్టే గెలవాలన్న ఆరాటంతో చూస్తారు. కానీ ఈ సారి గత శుక్రవారం జరిగిన రాయల్ చాలెంజర్స్కి చెన్నై సూపర్ కింగ్స్ కి జరిగిన మ్యాచ్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఒక అభిమాని ఒక విచిత్రమైన సందేశంతో కూడిన ప్లకార్డుతో దర్శనమిచ్చి అందరీ దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది అనే ఆత్రంగా ఉంది కదా! (చదవండి: తండ్రి ఔట్ కావడంతో కుర్చీని లాగి కొట్టిన ఏబీడీ కొడుకు, షాక్‌కు గురైన తల్లి!) ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా షార్జాలో రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆరు వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే ఆ మ్యాచ్‌లో ఒక అభిమాని రాయల్‌చాలెంజ్ జెర్సీని ధరించి ఒక సందేశంతో కూడిని ప్లకార్డుని పట్టుకుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్నవారందరూ మ్యాచ్ నుంచి దృష్టి మరల్చి మరీ అతని ప్లకార్డునే చూస్తున్నారు. ఇంతకీ ఆ ప్లకార్డులో ఏం ఉందంటే " నా భార్య చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోవడానికి అనుమతివ్వడం లేదు......." అని రాసి ఉంది. అతనేమో రాయల్‌చాలెంజ్ జెర్సీ ధరించి ప్లకార్డులో ఏమో అలా సందేశం ఉండేటప్పటికీ అందరూ ఒక్కసారిగా అతని వైపే దృష్టి సారించారు. తాను సీఎస్కే అభిమానిననే విషయం ఫ్లకార్డు ద్వారా చెప్పక్కనే చెప్పేశాడు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్సీబీ జెర్సీ ధరించాల్సి వచ్చిందనే విషయం కూడా అందరి తెలిసేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రేమ అనేది కలర్ బ్లైండ్నెస్ లాంటిది అని ఒకరు, ఆర్సీబీ జెర్సీలో ఉన్న సీఎస్కే అభిమాని అని మరొకరు అంటూ ...రకరకాలుగా స్పందిస్తున్నారు. (చదవండి: అందుకే బ్రావో ఈరోజు ఆడటం లేదు: ధోని) -
టాస్‌తో మొదలైంది ఆట కాదు... వాన!
-
కోల్‘ఖాతా’ తెరిచింది
కోల్‌కతా: సునీల్ నరైన్ (19 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (27 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (23 బంతుల్లో 44; 1 ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగారు. కోల్‌కతా బౌలర్లలో వినయ్ కుమార్, నితీశ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) రాణించాడు. నరైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొదట బెంగళూరు ఇన్నింగ్స్‌ను మెకల్లమ్ బౌండరీతో ప్రారంభించాడు. తొలి ఓవర్లోనే 2 ఫోర్లు ఒక భారీ సిక్సర్ బాదాడు. డికాక్(4) విఫలమవగా, కోహ్లి అండతో మెకల్లమ్ మరింత రెచ్చిపోయాడు. అర్ధసెంచరీకి అడుగులు వేస్తున్న ఇతన్ని నరైన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన డివిలియర్స్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్, నరైన్, చావ్లా, జాన్సన్ ఇలా ఎవరు బౌలింగ్‌కు దిగినా చుక్కలు చూపించాడు. అయితే నితీశ్ రాణా బౌలింగ్‌లో డివిలియర్స్, కోహ్లి (33 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) వరుస బంతుల్లో నిష్క్రమించడంతో స్కోరు వేగం మందగించింది. మన్దీప్ సింగ్ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో ధాటిగా ఆడాడు. లక్ష్యం కష్టసాధ్యమే అయినా నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పునాది వేయడంతో కోల్‌కతా విజయం దిశగా సాగిపోయింది. స్పిన్, పేస్ ఎవరెలా వేసినా అతని జోరుకు బ్రేకు వేయలేకపోయారు. కేవలం 17 బంతుల్లోనే (4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. లిన్ (5), ఉతప్ప (13) నిరాశపరిచినా... నితీశ్ రాణా (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో కోల్‌కతా బోణీ చేసింది. క్రిస్ వోక్స్ 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు. -
కేకేఆర్ లక్ష్యం 177
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్ చేపట్టింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను బ్రెండన్ మెకల్లమ్, డీ కాక్‌లు ఆరంభించారు. డీకాక్(4) ఆదిలోనే పెవిలియన్ చేరగా, మెకల్లమ్ మాత్రం విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించి రెండో వికెట్‌గా అవుటయ్యాడు. అటు తర్వాత విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 64 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన పిదప డివిలియర్స్ ఔటయ్యాడు. దాంతో జట్టు స్కోరు 127 పరుగుల వద్ద బెంగళూరు మూడో వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌కు యత్నించిన డివిలియర్స్(44;23 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆపై మరుసటి బంతికే కోహ్లి(31; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను నితీష్ రానా తన ఖాతాలో వేసుకుని కేకేఆర్‌లో జోష్‌ను నింపాడు. చివర్లో మన్దీప్ సింగ్ (37; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో నితీష్ రానా, వినయ్ కుమార్ చెరో రెండు వికెట్లు సాధించగా, పియూష్ చావ్లా, సునీల్ నరైన్, మిచెల్ జాన్సన్‌లు తలో వికెట్ తీశారు. -
విజయమే లక్ష్యంగా బరిలోకి...
►నేడు బెంగళూరుతో తలపడనున్న గుజరాత్ ►వరుస ఓటములతో ఇరుజట్లు డీలా ►తిరిగి పుంజుకునేందుకు ప్రణాళికలు రాజ్‌కోట్ : ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు చెరో గెలుపు మాత్రమే ఇరుజట్లు నమోదు చేసుకున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో.. బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడగా నాల్గింటిలో పరాజయం పాలయ్యాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి గాడిలోపడాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి. సొంతగడ్డపైనే ఏకైక విజయం గతేడాడి అరంగేట్రంలోనే మురిపించిన గుజరాత్ లయన్స్ ఈ సీజన్లో మాత్రం అంతంతమాత్రం ప్రదర్శననే కనబరుస్తోంది. తొలిరెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ విభాగం విఫలం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి చేరినా ప్రదర్శన మాత్రం మెరుగవ్వడంలేదు. చివరగా ముంబై ఇండియన్స్‌తో ఆడిన గుజరాత్.. బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారీ స్కోరును నమోదు చేసింది. అయితే బౌలర్లు విఫలం కావడంతో ఆరు వికెట్లతో పరాజయం పాలైంది. ముఖ్యంగా పేసర్లలో అండ్రూ టై ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనే ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోపేసర్ ప్రవీణ్ కుమార్ పవర్ ప్లేలలో రాణించినా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక స్టార్ స్పిన్నర్ జడేజా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. మరోవైపు స్పిన్నర్లు షాదాబ్ జకాతి, శివిల్ కౌశిక్ కూడా విఫలమవుతున్నారు. దీంతో బౌలింగ్ తిరిగి గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే భారత స్టార్ సురేశ్ రైనా, బ్రెండన్ మెకల్లమ్, ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తిక్, డ్వేన్ స్మిత్‌లతో పటిష్టంగా కన్పిస్తోంది. సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉంది. గుజరాత్ సాధించిన ఏకైక విజయం సొంతగడ్డపై నమోదు చేసింది. దీంతో బెంగళూరుతో మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఓవరాల్‌గా సాధ్యమైనంత త్వరగా గాడిలో పడి జట్టు తిరిగి గాడిన పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. కోహ్లి వచ్చినా.. మరోవైపు రాయల్ చాలెంజర్స్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చినా టీమ్ రాత మారలేదు. చివరగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ లాంటి భీకర బ్యాట్స్‌మన్ ఉన్నా ఫలితం లేకపోయింది. ఏ ఒక్కరు కాసేపు నిలబడినా జట్టు విజయం సాధించేదనడంలో సందేహం లేదు. మరోవైపు స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ వరుసగా విఫలమవుతుండడంతో జట్టులో చోటు కోల్పోయాడు. తను చివరి రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. ఈ పరిస్థితుల్లో జట్టు కూర్పుపై యాజమాన్యం తంటాలు పడుతోంది. బౌలింగ్ విషయానికొస్తే తైమల్ మిల్స్, బిల్లీ స్టాన్లకే, యజ్వేంద్ర చహల్, శ్రీనాథ్ అరవింద్, శామ్యూల్ బద్రీలు ఆకట్టుకుంటున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బద్రీ హ్యాట్రిక్ నమోదు చేసినా జట్టు ఓటమిపాలైంది. వీలైనంత త్వరగా జట్టు గెలుపుబాటలోకి రావాలని యాజమాన్యం ఆశిస్తోంది. -
ముంబై ఇండియన్స్ 'హ్యాట్రిక్'
-
‘లిక్కర్’కు నో చెప్పిన మరో క్రికెటర్
బెంగళూరు: ఐపీఎల్లో ఒక యువ క్రికెటర్ తమ జట్టు బ్రాండింగ్ కంటే తన మత విశ్వాసాలకే ప్రాధాన్యతనిచ్చాడు. మద్యం కంపెనీ బ్రాండింగ్‌తో ఉన్న దుస్తులను తాను ధరించనని రాయల్ చాలెంజర్స్ జట్టు క్రికెటర్ అవేశ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ జట్టు ‘కింగ్ ఫిషర్’ తదితర మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. 20 ఏళ్ల అవేశ్ విజ్ఞప్తిని అంగీకరించి ఆర్సీబీ ‘కింగ్ ఫిషర్’ బ్రాండింగ్ లేని టీమ్ జెర్సీని అతను ధరించేందుకు అనుమతించింది. బెంగళూరు జట్టు సభ్యులైన ఇక్బాల్ అబ్దుల్లా, సర్ఫరాజ్ ఖాన్, తబ్రేజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా) ఇప్పటికే దీనిని పాటిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అందరికంటే ముందుగా హషీం ఆమ్లా ఈ తరహాలో లిక్కర్ ఉత్పత్తులకు ప్రచారం చేసేందుకు నిరాకరించగా, ఆ తర్వాత ఇమ్రాన్ తాహిర్, ఫవాద్ అహ్మద్ (ఆస్ట్రేలియా) అతడిని అనుసరించారు. 2016 అండర్–19 ప్రపంచకప్‌లో నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన 20 ఏళ్ల అవేశ్ ఖాన్, ఆ టోర్నీలో 12 వికెట్లతో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. -
బిజీగా కోహ్లీ.. జట్టుతో కలిసి జీపు ప్రయాణం
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయం సాధించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు, హైదరాబాద్ టీమ్ అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ!
ఇంగ్లండ్ మహిళా జర్నలిస్ట్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ క్రిస్‌గేల్‌పై బీసీసీఐ విచారణ చేపట్టనుంది. ‘ఐపీఎల్ ఆడేందుకు వచ్చి ఇంటర్వ్యూలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఉపేక్షించకూడదు. దీనిపై బెంగళూరు జట్టు యాజమాన్యంతో మాట్లాడతాం. టోర్నీ ముగిసిన తర్వాత విచారణ చేపడతాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. -
ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్
ఐపీఎల్లో గాయాలబారిన పడిన తమ ఆటగాళ్ల స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు వేరే ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లసిత్ మలింగ స్థానంలో విండీస్ పేసర్ జెరోమ్ టేలర్‌ను ముంబై ఎంచుకోగా... మిషెల్ స్టార్క్‌కు బదులుగా ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను బెంగళూరు తీసుకుంది. గాయాల కారణంగా మలింగ, స్టార్క్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. -
బెంగళూరుకు మన్దీప్
బెంగళూరు: పంజాబ్ కింగ్స్ ఎలెవ న్ బ్యాట్స్‌మన్ మన్దీప్ సింగ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. దీంతో ఈ సీజన్లో తను బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడు నిలకడగా రాణిస్తున్నాడు. తనతో పాటు రాజస్తాన్ నుంచి బౌలర్ ఇక్బాల్ అబ్దుల్లాను కూడా బెంగళూరు టీమ్ తీసుకుంది. శుక్రవారంతో ఈ రెండో ట్రేడింగ్ విండో ముగియగా.. ఇప్పటిదాకా ఆరుగురు ఆటగాళ్లు ట్రేడింగ్‌లో తమ పాత జట్ల నుంచి మారారు. -
పాపం బెంగళూరు!
రాజస్థాన్ సూపర్ ఛేజింగ్ 5 వికెట్లతో ఆర్సీబీ చిత్తు యువరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా రాయల్స్‌ను గెలిపించిన స్మిత్, ఫాల్క్‌నర్ మ్యాచుకో కోటి రూపాయల భారాన్ని మోస్తూ వచ్చిన యువరాజ్ సింగ్ ఎట్టకేలకు తన విలువను ప్రదర్శించినా ఫలితం దక్కలేదు. భీకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లోనూ రాణించినా బెంగళూరు ఓటమి పాలైంది.భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువీ బౌలింగ్ ధాటికి చివరి 39 బంతుల్లో 85 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్థాన్ నిలిచింది. అయితే ఇదే మైదానంలో ఆసీస్ తరఫున ఆడి రికార్డు సెంచరీ సాధించిన ఫాల్క్‌నర్ ఈసారీ చిన్నస్వామి స్టేడియాన్ని సొంతం చేసుకున్నాడు. స్టీవెన్ స్మిత్‌తో కలిసి భారీ షాట్లతో చెలరేగి తమ జట్టును గెలిపించాడు. భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్థాన్‌కు అద్భుత విజయం దక్కగా...రాయల్ చాలెంజర్స్‌కు నిరాశే మిగిలింది. బెంగళూరు: యువరాజ్ చాన్నాళ్ల తరువాత అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా...అది బెంగళూరు విజయానికి సరిపోలేదు. భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన రాజస్థాన్ ప్రత్యర్థికి నిరాశను మిగిల్చింది. భారీస్కోరును సాధించినా దాన్ని కాపాడుకోవడంలో చాలెంజర్స్ విఫలమైంది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్ తొలుత బ్యాట్‌తో (38 బంతుల్లో 83; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఆపై బంతితో (4/35) చెలరేగి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. డివిలియర్స్ (32 బంతుల్లో 58; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం రాజస్థాన్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కరుణ్ నాయర్ (39 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... చివర్లో స్టీవెన్ స్మిత్ (21 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (17 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో చెలరేగి కోహ్లి సేనను చిత్తు చేశారు. వీరిద్దరు చివరి 17 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. ఫాల్క్‌నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. యువీ వీరంగం... బెంగళూరు ఇన్నింగ్స్ నిరాశాజనక రీతిలో ఆరంభమైంది. పార్థివ్‌ను కాదని గేల్‌తో కలిసి స్వయంగా ఓపెనింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లి (4) పేలవఫామ్‌ను కొనసాగిస్తూ మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. ఈ క్రమంలో గేల్ మూడు, విజయ్ జోల్ రెండు చొప్పున ఫోర్లు కొట్టినా.. పవర్ ప్లే ముగిసేటప్పటికి బెంగళూరుకు వికెట్ నష్టానికి 31 పరుగులు మాత్రమే లభించాయి. అయితే డివిలియర్స్‌కు జత కలిసిన యువరాజ్ చాన్నాళ్ల తరువాత తన విశ్వరూపం ప్రదర్శించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. తెవాటియా బౌలింగ్‌లో ఫోర్‌తో మొదలైన యువీ విజృంభణ.. ఆపై తీవ్రరూపం దాల్చి పరుగుల సునామీని సృష్టించింది. రజత్ భాటియా వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌తోపాటు మొత్తం 14 పరుగులు రాబట్టాడు. ఆపై తాంబే, రిచర్డ్సన్ల ఓవర్లలో మరో రెండు సిక్స్‌లతో 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. డివిలియర్స్ కూడా చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్‌లతో అర్ధసెంచరీ మైలురాయిని దాటాడు. యువీ, డివిలియర్స్‌ల విజృంభణతో చివరి 6 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు నమోదయ్యాయి. చివర్లో మెరుపులు... లక్ష్యఛేదనను రాజస్థాన్ దూకుడుగా ఆరంభించింది. రహానే, కరుణ్ నాయర్లు ప్రతి ఓవర్లోనూ కనీసం ఓ ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు నమోదయ్యాయి. అయితే రహానే (24)ను చహల్ ఔట్ చేశాక యువీ మాయ ప్రారంభమైంది. తన రెండో ఓవర్లో వాట్సన్ (1), బిన్నీ (1)లను, తరువాతి ఓవర్లో శామ్సన్ (13)ను వెనక్కి పంపాడు. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ఇక్కట్లలో పడినా.. మరోవైపు కరుణ్ నాయర్ దూకుడు మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నాయర్‌నూ యువరాజే ఔట్ చేశాడు. విజయానికి 36 బంతుల్లో 83 పరుగులు చేయాల్సివుండడంతో బెంగళూరు విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. కానీ, అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. స్టీవెన్ స్మిత్, ఫాల్క్‌నర్‌లు బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి దొరికిన బంతినల్లా బౌండరీ లైన్ దాటించారు. పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశారు. స్టార్క్ వేసిన 17వ ఓవర్లో 21 పరుగులు, దిండా వేసిన 18వ ఓవర్లో 23 పరుగులు రాబట్టారు. దీంతో చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశకు మ్యాచ్ చేరింది. అయితే ఫాల్క్‌నర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) భాటియా (బి) రిచర్డ్సన్ 4, గేల్ (సి) శామ్సన్ (బి) తాంబే 19, జోల్ (సి) వాట్సన్ (బి) తెవాటియా 16, డివిలియర్స్ (సి) రహానే (బి) ఫాల్క్‌నర్ 58, యువరాజ్ ఎల్బీడబ్ల్యూ (బి) రిచర్డ్సన్ 83, ఆల్బీ మోర్కెల్ (నాటౌట్) 1, పార్థివ్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1-6, 2-38, 3-40, 4-172, 5-186. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-43-2, వాట్సన్ 4-0-35-0, ఫాల్క్‌నర్ 4-0-42-1, తాంబే 4-0-38-1, తెవాటియా 3-0-17-1, భాటియా 1-0-13-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) పార్థివ్ (బి) చహల్ 24, కరుణ్ (బి) యువరాజ్ 56, వాట్సన్ (బి) యువరాజ్ 1, బిన్నీ (సి) సబ్-రోసో (బి) యువరాజ్ 1, శామ్సన్ (సి అండ్ బి) యువరాజ్ 13, స్మిత్ (నాటౌట్) 48, ఫాల్క్‌నర్ (నాటౌట్) 41, ఎక్స్‌ట్రాలు, 7, మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1-54, 2-61, 3-63, 4-82, 5-106. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-20-0, స్టార్క్ 3-0-33-0, దిండా 3-0-37-0, ఆరోన్ 2.5-0-41-0, యువరాజ్ 4-0-35-4, చహల్ 4-0-24-1. -
డివిలియర్స్ విధ్వంసం
సన్‌రైజర్స్ చిత్తు 4 వికెట్లతో బెంగళూరు గెలుపు వార్నర్, కరణ్ శ్రమ వృథా ఐపీఎల్-7లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డివిలియర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపాడు. సిక్సర్ల వర్షంతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 73 పరుగులే చేసిన ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ అసలు సమయంలో వీరబాదుడు బాదాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అజేయంగా 89 పరుగులు చేసి బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివర్లో బౌలర్లు విఫలం కావడంతో ‘సన్’కు పరాజయం తప్పలేదు. బెంగళూరు: గేల్ దుమారం లేకపోయినా... కోహ్లి వెనుదిరిగినా... యువీ మెరుపులు మెరిపించకపోయినా...ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు జట్టును గట్టెక్కించాడు. 95 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకున్నా... లోయర్ ఆర్డర్ సహకారంతో లక్ష్యాన్ని ఛేదించాడు. ఫలితంగా ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. వార్నర్ (49 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా, ధావన్ (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు. బెంగళూరు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. డివిలియర్స్‌తో పాటు గేల్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వార్నర్ దూకుడు ధావన్ నెమ్మదిగా ఆడినా... రెండో ఓవర్లో సిక్సర్, ఫోర్‌తో విరుచుకుపడ్డ ఫించ్ (13) తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. బౌండరీతో ఖాతా ప్రారంభించిన రాహుల్ (6) కూడా వెంటనే అవుట్ కావడంతో ‘సన్’ తడబడింది. వార్నర్, ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా రన్‌రేట్ మాత్రం తగ్గకుండా చూశారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లు కుదురుకోవడంతో వార్నర్, ధావన్‌లు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. చివరకు ఆరోన్ ఈ జోడిని విడగొట్టాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 9 ఓవర్లలో 62 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దిండా వేసిన 18వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సర్లు కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే ఐదు బంతుల వ్యవధిలో ఓజా, వార్నర్ వెనుదిరిగారు. చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు రావడంతో హైదరాబాద్ పోరాడే స్కోరు చేయగలిగింది. డివిలియర్స్ సిక్సర్ల వర్షం ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భువనేశ్వర్... పార్థివ్ (3), కోహ్లి (0)లను అవుట్ చేయడంతో బెంగళూరు తడబడింది. ఆరంభంలో పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గేల్ షాట్లు కొట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. దీంతో పరుగుల వేగం మందగించింది. స్టెయిన్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గేల్, ఆ తర్వాత ఇషాంత్‌కు ఓ ఫోర్, రెండు సిక్సర్లు రుచి చూపించాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన గేల్ బౌండరీ వద్ద స్యామీ చేతికి చిక్కాడు. దీంతో ఆర్సీబీ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోసో, గేల్ మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. డివిలియర్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించాక రోసో (14) అవుటయ్యాడు. తర్వాత వచ్చిన యువరాజ్ (14) నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తే.. డివిలియర్స్ మాత్రం వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 30 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. యువరాజ్ అవుటయ్యాక డివిలియర్స్ షో మొదలైంది. బౌలర్ ఎవరైనా సిక్సర్ల వర్షం కురిపించాడు. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించాడు. స్టార్క్‌తో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. స్యామీ ఓవర్లో 19, స్టెయిన్ ఓవర్లో 24 పరుగులు రావడంతో బెంగళూరు విజయం సులువైంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 13; ధావన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 37; రాహుల్ (సి) గేల్ (బి) దిండా 6; వార్నర్ (బి) స్టార్క్ 61; స్యామీ (సి) స్టార్క్ (బి) హర్షల్ పటేల్ 8; ఓజా (సి) స్టార్క్ (బి) ఆరోన్ 15; ఇర్ఫాన్ నాటౌట్ 4; కరణ్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-20; 2-29; 3-91; 4-115; 5-149; 6-150 బౌలింగ్: స్టార్క్ 4-0-21-2; దిండా 4-0-39-1; ఆరోన్ 4-0-33-2; హర్షల్ పటేల్ 4-0-29-1; చాహల్ 4-0-30-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) స్యామీ (బి) కరణ్ శర్మ 27; పార్థివ్ (బి) భువనేశ్వర్ 3; కోహ్లి (సి) ఓజా (బి) భువనేశ్వర్ 0; రోసోవ్ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ శర్మ 14; డివిలియర్స్ నాటౌట్ 89; యువరాజ్ (సి) (సబ్) హెన్రిక్స్ (బి) కరణ్ శర్మ 14; స్టార్క్ రనౌట్ 5; హర్షల్ పటేల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-5; 2-6; 3-38; 4-59; 5-95; 6-152. బౌలింగ్: స్టెయిన్ 4-0-39-0; భువనేశ్వర్ 4-0-16-2; ఇషాంత్ 3-0-35-0; కరణ్ శర్మ 4-0-17-3; ఇర్ఫాన్ 2.5-0-25-0; స్యామీ 2-0-25-0. -
బెంగళూరు ‘ఢమాల్’
70 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం ప్రవీణ్ తాంబే స్పిన్ మాయాజాలం ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన బ్యాటింగ్ లైనప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ది. దీనికి తగ్గట్లే మూడు మ్యాచ్‌ల పాటు చెలరేగిన స్టార్ ఆటగాళ్లు... అనూహ్యంగా నాలుగో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐపీఎల్లో తమ అత్యల్ప స్కోరు (70)కు ఆలౌటైన బెంగళూరు... రాజస్థాన్ చేతిలో ఓడింది. అబుదాబి: జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా.. క్రమశిక్షణతో, కలిసికట్టుగా ఆడితే ఎంతటి బలమైన జట్టునైనా మట్టి కరిపించవచ్చని రాజస్థాన్ రాయల్స్ మరోసారి నిరూపించింది. కోహ్లి, డివిలియర్స్, యువరాజ్ వంటి ‘కాస్ట్లీ’ ఆటగాళ్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అతి తక్కువ స్కోరుకే కుప్పకూల్చి అలవోక విజయం నమోదు చేసింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో దూకుడు ప్రదర్శించిన కోహ్లిసేన.. వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్‌ను ఓడించింది. తొలుత బెంగళూరు 15 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్లో బెంగళూరుకు ఇది అత్యల్ప స్కోరు కాగా, మొత్తంగా మూడో అత్యల్ప స్కోరు కావడం విశేషం. కెప్టెన్ కోహ్లి (21; 3 ఫోర్లు), స్టార్క్ (18; 2 ఫోర్లు), రాంపాల్ (13; 1 సిక్స్)లు మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు. అనంతరం రాజస్థాన్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే 71 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రహానే (19 బంతుల్లో 23; 4 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. రాజస్థాన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి ఓవర్ నుంచే.. విధ్వంసక ఓపెనర్ గేల్ మరోసారి డగౌట్‌కే పరిమితం కాగా, బెంగళూరుకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బిన్నీ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికే తకవాలే (0) వెనుదిరగ్గా, మరుసటి బంతికే పార్థివ్ (1) రనౌటయ్యాడు. ఆ వెంటనే రిచర్డ్సన్ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌తో యువరాజ్ (3) స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాతి బంతికే రిచర్డ్సన్.. డివిలియర్స్ (0)ను బౌల్డ్ చేయడంతో బెంగళూరు 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో సచిన్ రాణాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఆరో ఓవర్లో రాణా (3) వాట్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లకు 22 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత తాంబే స్పిన్ మాయాజాలం మొదలైంది. కోహ్లి సహా నాలుగు వికెట్లు తీసిన తాంబే ఐపీఎల్లో తన ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. రాయల్స్ అలవోకగా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో రహానే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అయితే అ తరువాత కూడా అదే జోరు కొనసాగించిన రహానేను ఐదో ఓవర్లో స్టార్క్ ఔట్ చేశాడు. ఆపై వెంట వెంటనే శామ్సన్ (2) రనౌట్ కావడం, కరుణ్ నాయర్ (8)నూ స్టార్క్ వెనక్కి పంపడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. క్రీజులోకొచ్చిన కెప్టెన్ షేన్ వాట్సన్ కొద్దిసేపు జాగ్రత్తగా ఆడినా.. ఆ తరువాత రెండు సిక్స్‌లు బాది కోహ్లిసేనకు మరో అవకాశం లేకుండా చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ రనౌట్ 1, తకవాలే (సి) శామ్సన్ (బి) బిన్నీ 0, విరాట్ కోహ్లి (సి) సౌతీ (బి) తాంబే 21, యువరాజ్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 3, డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 0, రాణా (బి) వాట్సన్ 3, ఆల్బీ మోర్కెల్ (సి) స్మిత్ (బి) తాంబే 7, స్టార్క్ (సి) బిన్నీ (బి) భాటియా 18, రాంపాల్ (సి) సౌతీ (బి) తాంబే 13, దిండా ఎల్బీడబ్ల్యూ (బి) తాంబే 0, చహల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం: (15 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1-1, 2-1, 3-5, 4-5, 5-17, 6-28, 7-46, 8-62, 9-70, 10-70. బౌలింగ్: బిన్నీ 1-0-1-1, సౌతీ 3-0-16-0, రిచర్డ్సన్ 4-0-18-2, వాట్సన్ 2-1-5-1, తాంబే 4-0-20-4, రజత్ భాటియా 1-0-7-1. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: అజింక్యా రహానే (సి) పార్థివ్ పటేల్ (బి) స్టార్క్ 23, కరుణ్ నాయర్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 8, శామ్సన్ రనౌట్ 2, అభిషేక్ నాయర్ నాటౌట్ 11, వాట్సన్ (సి) డివిలియర్స్ (బి) చహల్ 24, స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం: (13 ఓవర్లలో 4 వికెట్లకు) 71. వికెట్ల పతనం: 1-31, 2-35, 3-36, 4-68. బౌలింగ్: స్టార్క్ 4-0-29-2, రాంపాల్ 4-0-16-0, చహల్ 3-1-17-1, అశోక్ దిండా 2-0-8-0. -
పొరుగింటి ‘తీపి’ కూర...
సొంత టి20ని పట్టించుకోని యూఏఈ ఐపీఎల్‌పైనే అందరి దృషి సాక్షి క్రీడావిభాగం దుబాయ్‌లో రాయల్ చాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్‌ల మధ్య టి20 లీగ్ మ్యాచ్... రాయల్స్ తరఫున కమ్రాన్ అక్మల్, ఇమ్రాన్ నజీర్ చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు... అదేంటి? చాలెంజర్స్ అంటే మనకు క్రిస్ గేల్, కోహ్లి గుర్తుకొస్తారు కదా...అక్మల్ ఎక్కడినుంచి ఊడి పడ్డాడు అనుకుంటున్నారా! మీరు తప్పుగా చదవలేదు. జట్ల పేర్లు, ఆటగాళ్లు, టి20 మ్యాచ్ అంతా సరైందే. మరి తేడా ఎక్కడుంది? ఇదంతా ఐపీఎల్ టోర్నీ కాదు. సరిగ్గా అదే పోలికలతో యూఏఈ బోర్డు నిర్వహిస్తున్న సొంత టి20 లీగ్. ఇప్పుడు ఐపీఎల్ మాయలో పడి అక్కడి అభిమానులంతా దీనిని పట్టించుకోవడం లేదు గానీ... గత ఏడాది ఈ లీగ్ అక్కడి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఈ ‘సూపర్ స్టార్స్ టి20’ లీగ్‌ను వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో ఐపీఎల్ జరుగుతున్న స్టేడియానికి కూతవేటు దూరంలో అకడమిక్ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన లీగ్ మే 17 వరకు జరుగుతుంది. అంతా పాక్ ఆటగాళ్లే... ఐపీఎల్లో అవకాశం దక్కని పాకిస్థాన్ క్రికెటర్ల దృష్టి ఈ లీగ్‌పై పడింది. ఇక్కడ ఆడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, షర్జీల్, నజీర్, జంషెద్, అసద్ షఫీఖ్, యాసిర్ అరాఫత్, అన్వర్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్...ఇలా పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఈ లీగ్ బరిలో ఉన్నారు. సహజంగానే పాక్ క్రికెటర్లు అక్కడి అభిమానులను ఆకట్టుకోగలరు కాబట్టి తొలి ఏడాది లీగ్ సక్సెస్ అయింది. విండీస్ ఆటగాడు ర్యాన్ హిండ్స్, అప్పట్లో వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే కొవెంట్రీ, అఫ్ఘన్ ఆటగాడు గుల్బదన్ తదితరులు పాల్గొంటున్నారు. మొత్తం ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా 65 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ. 10 లక్షల 83 వేలు). ఫైనల్లో విజేతకు 40 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ. 6 లక్షల 65 వేలు) దక్కుతాయి. మన ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఇంతకంటే ఎక్కువే సంపాదిస్తారు. వీటితో పాటు కార్లు, బైక్‌లువంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఆటగాళ్లు గెలుచుకునే అవకాశం ఉంది. బరిలోకి దిగే క్రికెటర్లకు ఎంత మొత్తాలు ఇస్తారన్నది బహిరంగంగా వెల్లడించకపోయినా తాము సంతృప్తి పడే స్థాయిలో ఉన్నాయని క్రికెటర్లు చెప్పడం విశేషం. పేర్లూ ఆసక్తికరమే... సూపర్ స్టార్స్ టి20 టోర్నీలో యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలలోని నగరాలకు చెందిన పేర్లతో ఐపీఎల్‌ను పోలిన 16 జట్లు ఉన్నాయి. ప్రధానంగా యూఏఈలో స్థిరపడినవారిని దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లు పెట్టుకున్నారు. అహ్మదాబాద్ ఏసెస్, లాహోర్ గ్లాడియేటర్స్, అబుదాబి ఎంపరర్స్, కొచ్చి ఐలాండర్స్, హైదరాబాద్ నవాబ్స్, ఫైసలాబాద్ రేంజర్స్, సింగపూర్ స్ట్రైకర్స్, కాలికట్ టైగర్స్, ముంబై వారియర్స్, సియాల్కోట్ షార్క్స్, దుబాయ్ రాయల్స్, తెలిచెర్రి టైటాన్స్, ఢిల్లీ మొగల్స్, కరాచీ కింగ్స్, కొలంబో లయన్స్, గోవన్ కోబ్రాస్ పేరుతో జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీకి సమాంతరంగా ఐపీఎల్ జరుగుతుండటంతో కొంత కళ తప్పినా...యువ ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఇది కూడా మంచి వేదిక అని నిర్వాహకులు చెబుతున్నారు. -
యువీ ఒత్తిడిలో ఆడేందుకు ఇష్టపడడు
తల్లి షబ్నమ్ సింగ్ వ్యాఖ్య షార్జా: భారత ఆటగాడు యువరాజ్‌సింగ్ ఒత్తిడిలో ఆడటానికి ఏమాత్రం ఇష్టపడడని అతని తల్లి షబ్నమ్ సింగ్ అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలోనే యువరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో అటువంటి వాతావరణం ఉన్నందున ఆ జట్టుకు ఎంపికైనందుకు యువీ ఎంతో సంతోషించాడని షబ్నమ్ తెలిపారు. వైఫల్యాలలో ఉన్నప్పుడు అతడిని ఒత్తిడికి గురిచేయకుండా ఒంటరిగా వదిలివేయడమే మంచిదని, అందరు తల్లిదండ్రుల్లాగే తానూ యువీని సమాధాన పర్చేందుకే ప్రయత్నిస్తుంటానని ఆమె చెప్పారు. యువరాజ్ చదువులో చాలా వెనకబడి ఉండేవాడని, ప్రతి పాఠశాలలోనూ అతని గురించి ఉపాధ్యాయులు తనకు ఫిర్యాదు చేసేవారని, చివరికి తనకు క్రికెట్ సరైనదన్న నిర్ణయానికొచ్చానని షబ్నమ్ వివరించారు. -
ప్లీజ్... గెలవండి!
ఆటగాళ్లను కోరిన మాల్యా షార్జా: ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా తన మనసులోని కోరికను ఆటగాళ్ల ముందు బయటపెట్టారు. క్రికెటర్లతో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సాదర స్వాగతం పలికిన మాల్యా భారీ మొత్తానికి కొనుగోలు చేసిన యువరాజ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ‘మీరు ఏదైనా చేయగలరు. ఆ విషయం మీకు తెలుసు. ఐపీఎల్-7 ట్రోఫీని మనం అందుకోవాలి. జట్టులో మంచి వాతావరణం ఉంది. కాబట్టి శ్రమిస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది’ అని మాల్యా వ్యాఖ్యానించారు. షార్జాలో గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ ఐపీఎల్లో తమ పోరును ప్రారంభిస్తుంది.