సీఎస్‌కే జెర్సీ వేసుకుంటానంటే నా భార్య ఊరుకోలేదు..! | A Fan Says My Wife Did Not Allow Me To Wear MY CSK Jersy | Sakshi
Sakshi News home page

IPL 2021: సీఎస్‌కే జెర్సీ వేసుకుంటానంటే నా భార్య ఊరుకోలేదు..!

Published Mon, Sep 27 2021 3:51 PM | Last Updated on Mon, Sep 27 2021 5:28 PM

A Fan Says My Wife did Not Allow Me To Wear MY CSK Jersy - Sakshi

భారత క్రికెట్‌ అభిమానులకు ఈ ఐపీఎల్‌  సీజన్‌ అనేది వాళ్ళకి ఒక పండగలాంటి వాతావరణం. పైగా వాళ్ల అభిమాన ఆటగాళ్లు గెలవాలని పూజలు, మొక్కులు అంటూ రకరకాల వెర్రి అభిమానంతో వాళ్లు చేసే హంగామాలు అంత ఇంత అని చెప్పలేం. అయితే ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌ దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.  ప్రతి అభిమాని మ్యాచ్‌లోని ఇరు జట్లలోని తమ అభిమాన స్టార్‌ ఆటగాళ్లపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రతి నిమిషం ఉత్కంఠతో తమ స్టార్‌ ఆటగాడు జట్టే గెలవాలన్న ఆరాటంతో చూస్తారు. కానీ ఈ సారి గత శుక్రవారం జరిగిన రాయల్‌ చాలెంజర్స్‌కి చెన్నై సూపర్‌ కింగ్స్‌ కి జరిగిన మ్యాచ్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.  ఒక అభిమాని ఒక విచిత్రమైన సందేశంతో కూడిన ప్లకార్డుతో దర్శనమిచ్చి అందరీ దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది అనే ఆత్రంగా ఉంది కదా!

(చదవండి: తండ్రి ఔట్‌ కావడంతో కుర్చీని లాగి కొట్టిన ఏబీడీ కొడుకు, షాక్‌కు గురైన తల్లి!)


ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా షార్జాలో రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆరు వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే ఆ మ్యాచ్‌లో ఒక అభిమాని రాయల్‌చాలెంజ్‌ జెర్సీని ధరించి ఒక సందేశంతో కూడిని  ప్లకార్డుని పట్టుకుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్నవారందరూ మ్యాచ్‌ నుంచి దృష్టి మరల్చి మరీ అతని ప్లకార్డునే చూస్తున్నారు. ఇంతకీ ఆ ప్లకార్డులో ఏం ఉందంటే " నా భార్య చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీ వేసుకోవడానికి అనుమతివ్వడం లేదు......." అని రాసి ఉంది. అతనేమో రాయల్‌చాలెంజ్‌ జెర్సీ ధరించి ప్లకార్డులో ఏమో అలా సందేశం ఉండేటప్పటికీ అందరూ ఒక్కసారిగా అతని వైపే దృష్టి సారించారు. తాను సీఎస్‌కే అభిమానిననే విషయం ఫ్లకార్డు ద్వారా చెప్పక్కనే చెప్పేశాడు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్సీబీ జెర్సీ ధరించాల్సి వచ్చిందనే విషయం కూడా అందరి తెలిసేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో ప్రేమ అనేది కలర్‌ బ్లైండ్‌నెస్‌ లాంటిది అని ఒకరు, ఆర్‌సీబీ జెర్సీలో ఉన్న సీఎస్‌కే అభిమాని అని మరొకరు అంటూ  ...రకరకాలుగా స్పందిస్తున్నారు. 

(చదవండి: అందుకే బ్రావో ఈరోజు ఆడటం లేదు: ధోని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement